పిల్లిని కూడా వదల్లేదు... మూగజీవిపై గ్యాంగ్ రేప్... వారం రోజులు,ఏడుగురు టీనేజర్స్..
పాకిస్తాన్లోని లాహోర్లో అత్యంత కిరాతకమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది టీనేజర్స్ ఓ పిల్లిపై గ్యాంగ్రేప్కి పాల్పడ్డారు. లైంగికంగా దాన్ని తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. వారం పాటు ఆ టీనేజర్స్ దానిపై జరిపిన ఆకృత్యాలకు అది మరణం అంచులకు చేరుకుంది. జేఎఫ్కె జంతు సంరక్షణ ఎన్జీవో సంస్థ ఈ దారుణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

ఇదీ జరిగింది...
జేఎఫ్కె జంతు సంరక్షణ సంస్థ తమ ఫేస్బుక్లో పోస్టు చేసిన వివరాల ప్రకారం... లాహోర్లోని ఓ కుటుంబం ఇటీవల ఓ బుజ్జి పిల్లిని కొనుగోలు చేసింది. ఆ కుటుంబంలోని ఓ మైనర్ బాలుడు,అతని ఆరుగురు స్నేహితుల కన్ను దానిపై పడింది. ఈ క్రమంలో అంతా కలిసి ఆ పిల్లిపై వారం రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ పిల్లి మర్మావయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ భాగాల నుంచి నిరంతరం రక్తం,వీర్యం కారడం మొదలైంది.

ఇలా వెలుగులోకి...
ఆ టీనేజర్స్ ఆకృత్యానికి ఆ పిల్లి నడవలేని స్థితికి చేరుకుంది. కనీసం తిండి కూడా తినలేక,బాధతో విలవిల్లాడుతూ నిద్ర కూడా పోలేక నరకం అనుభవించింది. ఆ పిల్లి పరిస్థితిని గమనించిన ఓ స్థానిక అమ్మాయికి ఎందుకో అనుమానం వచ్చింది. దాన్ని తనకు ఇవ్వాలని,తాను చూసుకుంటానని ఆ టీనేజర్స్తో చెప్పింది. అయితే మొదట వారు అందుకు నిరాకరించారు. ఆ తర్వాత మనసు మార్చుకుని పిల్లిని ఆమెకు ఇచ్చేసి వెళ్లిపోయారు. పిల్లిని గమనించిన ఆ అమ్మాయి.. దాన్ని లైంగికంగా చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించింది. దీనిపై జేఎఫ్కె జంతు సంరక్షణ సంస్థకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

చనిపోయిన పిల్లి...
జేఎఫ్కె జంతు సంరక్షణ అధికారులు ఆ పిల్లిని ఓ వెటర్నరీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో పిల్లి చనిపోయింది. దీనిపై జేఎఫ్కె అధికారులు మాట్లాడుతూ... ' చనిపోయిన ఆ పిల్లిని పూడ్చి పెట్టాం. మాకు తెలిసి కచ్చితంగా అది ఆ దేవుడితో మాట్లాడుతుంది. ఈ క్రూర ప్రపంచంలో దానికి ఎదురైన చేదు అనుభవాన్ని దేవుడితో పంచుకుంటుంది. ఆ పిల్లిపై దాడిని గుర్తించిన అమ్మాయి... దాని ధీనావస్థను చూసి చలించిపోయింది. అంత బాధతో అది బతికి ఉండటం కంటే... దేవుడు దాన్ని తీసుకెళ్లిపోవాలని ప్రార్థించింది.' అంటూ చెప్పుకొచ్చారు.

మహిళలు,చిన్నారులకే దిక్కు లేదు... ఇక మూగజీవాల సంగతి దేవుడెరుగు..
టీనేజర్స్ ఇంత క్రూరంగా వ్యవహరించడం పట్ల జేఎఫ్కె జంతు సంరక్షణ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 'మూగజీవులపై లైంగిక దాడులకు పాల్పడటం సులువు. అవి మాట్లాడలేవు. కనీసం తమ బాధను చెప్పుకోలేవు. వాటిని తీవ్రంగా పరిగణించే చట్టాలేవీ లేవు. కాబట్టి రేపిస్టులు ఏ కుక్కనో,పిల్లినో,కోతినో రేప్ చేయడానికి ఎంచుకుంటున్నారు.' అని జేఎఫ్కె అధికారులు చెప్పారు. విద్యార్థుల్లో దీని పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు,చిన్నారులకే న్యాయం జరగని పాకిస్తాన్ లాంటి దేశాల్లో జంతువుల బాధలను ఎవరు మాత్రం పట్టించుకుంటారని వాపోయారు. అయితే విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం అని,అలాగే జంతువులపై లైంగిక దాడులకు పాల్పడకుండా వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.