వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల్‌భూషన్ జాదవ్ కేసు : నేరాన్ని అంగీకరించమని ఆయనపై పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడి తెస్తోంది

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషన్ జాదవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని భారత విదేశంగా శాఖ ప్రకటించింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాకిస్థాన్ వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ వెల్లడించారు. విచారణపై సమగ్ర నివేదికను రూపోందిస్తున్నామని ఆయన్ను సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

పాక్ జైలులోజాదవ్ ‌ను కలిసిన గౌరవ్ ఆహ్లువాలియా

పాక్ జైలులోజాదవ్ ‌ను కలిసిన గౌరవ్ ఆహ్లువాలియా

పాకిస్తాన్ సబ్ జైలులో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లువాలియా కలిశారు. ఈ నేపథ్యంలోనే గంటపాటు కుల్‌భూషన్ జాదవ్ ‌తో సమావేశం కొనసాగింది. ఈనేపథ్యంలోనే కుల్‌భూషన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని తెలిపింది. జాదవ్ కలిసిన విషయంలో ఒక సమగ్ర నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పై పాకిస్థాన్ తప్పుడు ఆరోపణలు చేసి వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తున్నట్టు భారత విదేశంగా అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు.

సురక్షితంగా తీసుకువస్తాం

సురక్షితంగా తీసుకువస్తాం

మరోవైపు విదేశీ వ్యవహారాల ఇంచార్జ్ నుండి వివరణాత్మక నివేదికను స్వీకరించడంతో పాటు, ఐసిజె ఆదేశాలను బట్టి ఎంతవరకు అనుగుణంగా ఉందో నిర్ణయించిన తరువాత మేము తదుపరి చర్యను నిర్ణయిస్తామని రావిష్ కుమార్ తెలిపారు.జాదవ్ త్వరగా న్యాయం పొందేలా మరియు భారతదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందిని రావిష్ కుమార్ తెలిపారు.

అంతర్జాతీయ ఒత్తిడితో రాయబారి ఆమోదం

అంతర్జాతీయ ఒత్తిడితో రాయబారి ఆమోదం

అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ యాక్సెస్ ఇస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో నే పాకిస్తాన్ సబ్ జైలులో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లువాలియా కలిశారు. ముందుగా రాయబారి కలిసేందుకు అవకాశమిచ్చిన పాకిస్థాన్ కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే .

English summary
Kulbhshan Jadhav appeared to be under “extreme pressure” to parrot a false narrative to bolster Pakistan’s untenable claims in his case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X