వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు షాక్: కువైట్ నుండి దౌత్యవేత్తల బహిష్కరణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

దుబాయ్: వరుస క్షిపణి ప్రయోగాలు చేసిన ఉత్తరకొరియాకు ప్రపంచదేశాల నుండి ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఉత్తరకొరియా చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి.కువైట్‌లోని నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయనుంది.

కువైట్‌ దేశం. కువైట్‌లోని ఉత్తరకొరియా రాయబారి, మరో నలుగురు దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేయనుంది.ఉత్తరకొరియా ఇటీవల అతిశక్తిమంతమైన హైడ్రోజన్‌ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే.

టెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమేటెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమే

అమెరికా సహా ఆసియా దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్తరకొరియా మిత్రదేశాలు తమ సంబంధాలుతెంచుకోవాలని ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కువైట్‌ ఈ నిర్ణయం తీసుకొంది.గల్ఫ్‌ దేశాలన్నింటిలో ఉత్తరకొరియాకు ఎంబసీ కువైట్‌లోనే ఉంది.

కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, యూఏఈ లాంటి దేశాలకు ఉత్తరకొరియా నుండి జీవనం కోసం ప్రజలు వస్తుంటారు. అయితే వరుస అణుపరీక్షల కారణంగా కొరియాకు బుద్దిచెప్పేందుకు కువైట్ ఈ నిర్ణయం తీసుకొంది.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'

దీంతో ఆర్థికంగా ఉత్తరకొరియాకు అడ్డుకట్ట వేసేందుకు కువైట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై కువైట్‌లోని ఉత్తరకొరియా ఎంబసీ ఇంకా స్పందించలేదు.

Kuwait to Expel North Korean Ambassador, Other Diplomats
చైనా, రష్యాలతో పోలిస్తే.. గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే తమ దేశ ఉద్యోగుల నుంచే ఉత్తరకొరియాకు ఎక్కువ ఆదాయం వస్తోంది. 2015 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. 50వేల మందికి పైగా ఉత్తరకొరియా ప్రజలు విదేశాల్లో పనిచేస్తూ ఏడాదికి 1.2 నుంచి 2.3 బిలియన్‌ డాలర్లు ఆర్జిస్తున్నారు.
English summary
Kuwait will expel North Korea's ambassador to the oil-rich country and four other diplomats, potentially limiting Pyongyang's ability to earn money for its nuclear program from laborers it sends to the Gulf.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X