వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకేసారి ఏడుగురికి మరణశిక్ష, నేరస్తుల్లో ఒక రాజవంశీకుడు కూడా...

కువైట్ ప్రభుత్వం ఒకేసారి ఏడుగురు నేరస్తులకు మరణశిక్ష అమలు పరిచింది. నేరస్తుల్లో ఒక రాజవంశీకుడు కూడా ఉన్నాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కువైట్: చట్టాలను అమలు చేసే విషయంలో తాము కూడా సౌదీ అరేబియాకు ఏమాత్రం

తీసిపోమని తెలియజేసేలా కువైట్ ప్రభుత్వం ఒకేసారి ఏడుగురు నేరస్తులకు మరణశిక్ష

అమలు పరిచింది.

hanging rope

వీరిలో ఒక రాజవంశీకుడు కూడా ఉన్నాడు. గతేడాది సౌదీలో కూడా ఇలాగే యువరాజుకు

కూడా మరణశిక్ష అమలు జరిపారు. బుధవారం పలు కేసుల్లో ఉరిశిక్ష పడిన కువైట్,

ఇథియోపియన్, ఫిలిప్పీన్ దేశానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు.. ఈజిప్టుకు చెందిన

ఇద్దరు వ్యక్తులు, ఓ బంగ్లాదేశీయుడు, మరో కువైటీని ఉరితీశారు.

ఈ ఆరుగురితోపాటు రాజకుటుంబానికి చెందిన షేక్ ఫైసల్ అల్ అబ్దుల్లా అల్ షబాహ్ ను

కూడా ఉరితీశారు. ఏడుగురు నేరస్తులకు బుధవారం కువైట్ కేంద్ర కారాగారంలో

మరణశిక్షను అమలు జరిపారు.

కొత్త ఏడాదిలో తొలిసారి మరణశిక్షను అమలు జరిగిన నేపథ్యంలో కువైట్ అంతటా గంభీర

వాతావరణం నెలకొంది. ఉరిశిక్ష అమలుకు ముందు కొన్ని గంటలపాటు తమ బంధువులను

కలిసే అవకాశాన్ని నేరస్తులకు కల్పించారు.

English summary
Kuwait hanged seven prisoners in a mass execution on Wednesday, including a royal family member and a woman convicted of killing 58 women and children, a Bangladeshi, a Filipina, an Ethiopian, two Kuwaitis and two Egyptians, according to a statement carried on the state-run KUNA news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X