• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రగ్స్ వ్యభిచారం కేసులో లేబర్ పార్టీ ఎంపీ కీత్ వాజ్‌పై వేటు

|

లండన్ : అమెరికాలో మహిళా ప్రజాప్రతినిధి క్యాతీ హిల్స్ సిబ్బందితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న ఆరోపణలు వచ్చి కొన్ని గంటలు గడవకముందే బ్రిటన్ ప్రజాప్రతినిధిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. లేబర్ పార్టీ ఎంపీ కేత్ వాజ్ డ్రగ్స్ కోసం మరియు లైంగిక కోరికల కోసం డబ్బులు చెల్లించారని రుజువులు ఉన్నాయని విచారణ చేస్తున్న కామన్స్ స్టాండర్డ్ బాడీ తెలిపింది. ఆరోపణలు రుజువులతో సహా నిరూపితమైనందున ఆయన్ను ఆరునెలల పాటు సస్పెండ్ చేయాలని నివేదికలో వెల్లడించింది.

మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు, అక్రమ సంబంధం, రేప్ చేసి చంపేశారు !

ప్రస్తుతం తాను మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నానని వాజ్ చెప్పారు. తన భవిష్యత్తు గురించి తాను ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని చెప్పారు. అయితే విచారణకు వాజ్ పూర్తిగా సహకరించారని తన కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల చేశారు. సోమవారం రోజునే తాను హాస్పిటల్‌లో చేరారని లేఖలో పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికకు 10శాతం మంది సభ్యులు అనుకూలంగా ఓటువేస్తే వాజ్‌ను సస్పెండ్ చేసి అక్కడ ఉపఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాజ్‌పై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ ఆండ్రూ బ్రిడ్జెన్ ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. న్యాయం ఆలస్యంగా జరిగినప్పటికీ సరిగ్గా జరిగిందని ఆండ్రూ తెలిపారు. ఇక కేత్ వాజ్‌పై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయని ఇక రబ్బర్ స్టాంప్ మాత్రమే వేయాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

 Labour Party MP Keith Vaz suspended after Drug and sex probe

ఇదిలా ఉంటే లీసెస్టర్ ఎంపీ కేత్ వాజ్ విచారణ సంస్థకు సహకరించారని అతని ఆరోగ్యం సరిగ్గా లేకపోయినప్పటికీ ఆయన అన్ని వివరాలు చెప్పారని అతని తరపున ఒక ప్రతినిధి తెలిపారు. రహస్యంగా ఉండాల్సిన అన్ని మెడికల్ రిపోర్ట్స్‌ను విచారణ కమిటీతో పంచుకున్నారని ఇంక ఇంతకన్నా చేయాల్సింది ఏముంటుందని చెప్పారు. ఇక చెప్పాల్సిందంతా రాతపూర్వకంగా ఇచ్చారని కూడా చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో కేత్ వాజ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇదిలా ఉంటే ఇద్దరు మగవ్యక్తులను వ్యభిచారంలోకి దింపారని వారికి డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు వాజ్ పై ఉన్నాయి. ఇక మూడో వ్యక్తికి అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేసి ఇచ్చారనే ఆరోపణలు కూడా వాజ్‌పై వచ్చాయి. అయితే ఇదంతా తమ విచారణలో నిరూపితమైందని కమిటీ పేర్కొంది. ఇక ఒక ఎంపీ స్థానంలో ఉంటూ ఇలాంటి పనులకు పాల్పడటం హౌజ్ ఆఫ్ కామన్స్‌కు ఉన్న మంచి పేరును చెడగొట్టడమే అని కమిటీ పేర్కొంది. తమ విచారణ సందర్భంగా వాజ్ పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వకుండా నిజాలను దాచిపెట్టారని వెల్లడించారు.

English summary
Labour MP Keith Vaz "disregarded" the law by "expressing a willingness" to help buy cocaine for male prostitutes, the Commons standards body has found.It said there was "compelling evidence" he offered to pay for a class A drug and had paid-for sex in August 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more