వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: లఖ్వీకి పాక్ రక్షణ, హఫీజ్‌తో చర్చ? గుజరాత్ తీరంలో అరెస్ట్‌పై పాక్ ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాహోర్: ముంబై దాడుల కేసులో కీలకమైన ఉగ్రవాది జకీ వుర్ రెహ్మాన్ లఖ్వీని విడుదల చేసి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్, అతనికి భద్రతను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదం పైన పాకిస్తాన్‌ది రెండు నాల్కల ధోరణి అనేందుకు లఖ్వీ వ్యవహారమే నిదర్శనంగా చెప్పవచ్చు.

పాకిస్తాన్ లఖ్వీని లాహోర్‌కు దగ్గరలోని ఐఎస్ఐ సేఫ్ హౌస్‌లో ఉంచిందని వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీ అతనికి రక్షణంగా ఉన్నారని తెలుస్తోంది. లఖ్వీని ఉంచింది లాహోర్ ఔట్ స్కర్ట్స్‌లో అని తెలుస్తోంది. ఏప్రిల్ 10న లఖ్వీని అడియాలా జైలు నుండి విడుదల చేశారు.

‘Lakhvi guarded by Pak commandos, living in ISI safe house near Lahore’

అప్పటి నుండి అతనికి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. లఖ్వీ విడుదల తదితరాల పైన భారత్ ప్ర్తత్యేక దృష్టి సారించింది. పాకిస్తాన్ తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసింది. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ భద్రతలో ఉన్న లఖ్వీ సయీద్ హఫీజ్‌తో ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

గుజరాత్ తీరంలో పాకిస్తాన్ వ్యక్తుల అరెస్ట్, ఆరా

గుజరాత్ రాష్ట్ర తీరంలో పాకిస్తాన్‌కు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని పైన పాకిస్తాన్ హై కమిషనర్ కేంద్ర హోంశాఖ నుండి ఆరా తీసింది.

English summary
In what exposes Pakistani establishment’s deep rooted links with terror outfits like the Lashkar-e-Toiba, it has now come to the fore that 26/11 Mumbai attacks mastermind Zaki-ur-Rehman Lakhvi is being protect by Pakistan Army commandos in plainclothes and is staying at a safehouse near Lahore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X