వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ తాజా స్ధితిపై లాన్సెట్ అధ్యయనం-కరోనా కొనసాగడం ఖాయం-అంటువ్యాధి తీవ్రతకు ముగింపు

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కోవిడ్ 19 మహమ్మారిపై పలు అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇందులో కోవిడ్ 19 ఇంకా ఎన్నాళ్లనే అంశంపైనే ఎక్కువగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దేశవిదేశాల్లో ఆర్ధిక వ్యవస్ధలతో పాటు ప్రజా జీవితాల్ని కూడా కుదిపేస్తున్న కోవిడ్ 19 మహమ్మారి అంతంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అధ్యయన సంస్ధ లాన్సెట్ తాజాగా చేసిన పరిశోధన ఫలితాలు వెల్లడయ్యాయి.

కరోనా ఆరోగ్య వ్యవస్థలు, ప్రభుత్వాలతో సహజీవనం చేసే మరో పునరావృత వ్యాధిగా మారుతుందని లాన్సెట్ అధ్యయనం పేర్కొంది. SARS-CoV-2 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు, సమాజాల అసాధారణ చర్యల యుగం ముగిసిందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కొనసాగుతుందని, ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ చేసినా రోగనిరోధక శక్తి మాత్రం క్షీణిస్తుందని తెలిపింది. ఇది SARS-CoV-2 వ్యాప్తి కొనసాగేందుకు అవకాశాలను సృష్టిస్తుందని తెలిపింది. కాలానుగుణంగా, దేశాలు శీతాకాలపు నెలలలో కరోనా వ్యాప్తిని ఎదుర్కోక తప్పదని తెలిపింది. అయితే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. తూర్పు యూరప్, ఆగ్నేయాసియా వంటి ఒమిక్రాన్ వేవ్ ఇంకా ప్రారంభం కాని దేశాల్లో తాజా ఓమిక్రాన్ వేవ్ లు వస్తాయని భావిస్తున్నారు.

Lancet Study predicts covid to continue but pandemic will end soon

Recommended Video

COVID-19 Norms For International Travellers | Oneindia Telugu

ఓమిక్రాన్ యుగంలో, కోవిడ్-19 నియంత్రణ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అధ్యయనం తెలిపింది. ఓమిక్రాన్ వేవ్ వేగం, తీవ్రతను బట్టి చూస్తే దీన్ని కనిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించవని ఈ నివేదిక పేర్కొంది. మహమ్మారికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సమాజాలు తీసుకున్న ప్రయత్నాలను, అది ఎలా మారిపోయింది, ప్రాణాలను కాపాడిందనే అంశాల్ని లాన్సెట్ అధ్యయనం ప్రస్తావించింది. కొత్త వ్యాధి కారకానికి ప్రతిస్పందించడానికి రెండు సంవత్సరాలుగా అసాధారణ సామాజిక ప్రయత్నాలు జరిగాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలలో విధానపరమైన స్పందన పెరిగిందని కూడా తెలిపింది.ఈ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని జీవితాలను రక్షించాయని పేర్కొంది.

English summary
the lancet's latest study predicts that covid 19 will continue but pandemic will end soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X