వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాస్‌వెగాస్: పక్కా ప్లాన్, భారీగా ఆయుధాల సేకరణ

లాస్‌వెగాస్ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితుడు భారీగా ఆయుధాల సేకరణఐసిస్ తీవ్రవాదులు ఈ ఘటన వెనుక ఉన్నారనే విషయమై ఆధారాలు లేవని ఎప్‌బిఐ ప్రకటించిందిస్టీఫెన్ పెడాక్ ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే విష

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లాస్‌వెగాస్‌లోని మ్యూజిక్‌ కన్సార్ట్‌లో మారణహోమం సృష్టించేందుకు స్టీఫెన్ పెడాక్ పక్కా ప్రణాళికను రచించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఫెడాక్ జరిపిన కాల్పుల్లో 58 మంది చనిపోయారు.

లాస్‌వెగాస్: అమెరికాకు ఫెడాక్ ప్రియురాలు, యుద్దంలో గాయం లేదు, కానీ..లాస్‌వెగాస్: అమెరికాకు ఫెడాక్ ప్రియురాలు, యుద్దంలో గాయం లేదు, కానీ..

పెద్ద ఎత్తున పెడాక్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని నిల్వ చేశాడని పోలీసులు గుర్తు చేశారు. వ్యూహాత్మకంగానే మెరుపు దాడికి దిగాడని అధికారులు భావిస్తున్నారు.అయితే ఇంతటి నరమేథానికి 64 ఏళ్ల పెడాక్‌ను పురిగొల్పిందేమిటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలింది.

Las Vegas gunman stockpiled weapons over decades, planned attack

గుంభనంగా ఉంటూ రహస్య జీవితం గడిపేందుకు మొగ్గు చూపే పెడాక్‌ ఏళ్ల తరబడి ఆయుధాలను నిల్వ చేస్తూ మృత్యు ఘంటికలు ఎందుకు మోగించాడనేదే ప్రశ్నగా ముందుకొస్తున్నదని లాస్‌వెగాస్‌ షెరీఫ్‌ జోసెఫ్‌ లాంబర్డో పేర్కొన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కేవలం పెడాక్‌ ఒక్కడే సేకరించి, నిల్వ చేశాడనడం ఊహకందని విషయమన్నారు. ఈ ప్రక్రియలో పెడాక్‌కు ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అభిప్రాయపడ్డారు.

మరోవైపు కాల్పుల ఘటన అనంతరం సజీవంగా బయటపడేందుకు పెడాక్‌ ప్రయత్నించాడనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మ్యూజిక్‌ కన్సార్ట్‌ జరిగిన వేదికకు దగ్గరలోని ఓ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. ఇక మారణకాండ చోటుచేసుకున్న హోటల్‌ సూట్‌ నుంచి, మరో మూడు ప్రాంతాల నుంచీ పోలీసులు దాదాపు 50 వరకూ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో 15 రైఫిళ్లలో బుల్లెట్లు నింపిఉన్నాయని చెప్పారు. ఇవన్నీ ఆటోమేటిక్‌ వెపన్స్‌ అని, పెడాక్‌ 2016 అక్టోబర్‌లోనే 30కి పైగా గన్‌లను కొనుగోలు చేశాడని విచారణలో తేలిందన్నారు.మరోవైపు కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాద కుట్ర దాగుందని ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎఫ్‌బీఐ స్పెషల్‌ ఏజెంట్‌ అరోన్‌ రోజ్‌ చెప్పారు.

English summary
The Las Vegas gunman who killed 58 people and himself in the deadliest mass shooting in modern U.S. history stockpiled weapons and ammunition over decades, and meticulously planned the attack, authorities believe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X