వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాస్‌వెగాస్ కాల్పులు : లక్ష డాలర్లు ఫిలిఫ్పీన్స్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన పెడాక్

లాస్‌వెగాస్‌లో కాల్పులకు పాల్పడి 58 మంది మృతికి కారణమైన ఫెడాక్ కొన్ని రోజుల ముందే లక్ష డాలర్లు ఫిలిఫ్పిన్స్‌కు బదిలీ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: లాస్‌ వెగాస్‌లో మారణహోమానికి కారణమైన ఉన్మాది స్టీఫెన్‌ పెడాక్‌ (64) కాల్పుల ఘటనకు కొన్ని రోజుల ముందు లక్ష డాలర్లను బదిలీ చేశారని పోలీసులు గుర్తించారు.

కాల్పులు జరిపిన ఉన్మాది స్టీఫెన్‌ పెడాక్‌ (64) ఎందుకు ఆ విధంగా చేసి ఉంటాడనే గుట్టు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు.
పిలిప్పీన్స్‌లో అతడి గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే ఉంటుంది. అయితే, ఆ డబ్బు ఆమెకే పంపించాడా లేక మరింకెవరికైనా పంపించాడా అనే విషయం తేలాల్సి ఉంది.

Las Vegas Shooter Stephen Paddock transferred $100,000 to Philippines, set up cameras at hotel room

అయితే, సంపన్నుడైన పెడాక్‌ రోజుకు కనీసం పది వేల డాలర్లను జూదంలో వెచ్చించేవాడని పోలీసులు తెలుసుకున్నారు. ఇలా ఎలా సాధ్యం అయిందనే దిశగా కూడా తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇక ప్రస్తుతం పిలిప్పీన్స్‌లో ఉంటున్న అతడి గర్ల్‌ఫ్రెండ్‌ మారిలౌ డాన్లీ (62)ని పోలీసులు తీరిగి బుధవారం అమెరికాకు రప్పించాలనుకుంటున్నారు.

ఆమెను ప్రశ్నించడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని వారు భావిస్తున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పక్కా ప్లాన్‌ ప్రకరమే అతడు ఈ దారుణకాండకు తెగించాడని తెలుస్తోంది.

అతడు అద్దెకు తీసుకున్న హోటల్‌లోని 32అంతస్తులో ప్రత్యేకంగా బయటా లోపల సెక్యూరిటీ కెమెరాలు కూడా అమర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం ఎవరైనా వస్తే వారిని గుర్తించేందుకు పోలీసులైతే తప్పించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు.. మరోపక్క, ఐసిస్‌ కూడా తామే ఈ దాడికి కారణం అని ప్రకటించగా అలా అయ్యే చాన్స్‌ లేదని పోలీసులు కొట్టి పారేస్తున్నారు. విచారణ పూర్తయితేగాని తాము క్లారిటీ ఇవ్వలేమంటున్నారు.

ఉన్మాది గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ప్రశ్నించినప్పటికీ నేరుగా సమాధానాలు చెప్పేందుకు పోలీసులు ఆసక్తి చూపడం లేదు. ఉన్మాది నిజంగానే ముస్లిం మతంలోకి మారాడా? ఐసిస్‌‌తో సంబంధాలున్నాయా? తానే ఉన్మాదిలా మారి ఉద్దేశ్యపూర్వకంగా ఈ కాల్పులకు తెగబడ్డాడా? ఈ విషయాన్ని తన గర్ల్‌ఫ్రెండ్‌‌కు చెప్పాడా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్‌ కన్సర్ట్‌ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు స్టీఫెన్‌ పెడాక్‌ . కన్సర్ట్‌ వేదిక పక్కనున్న హోటల్‌లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు.

English summary
The Las Vegas gunman transferred $100,000 overseas+ in the days before the attack and planned the massacre so meticulously that he even set up cameras inside the peephole of his high-rise hotel room and on a service cart outside his door, apparently to spot anyone coming for him, authorities said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X