• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జో బైడెన్‌ను కిందకు లాగేందుకు రిపబ్లికన్ సెనేట్ల చివరి ప్రయత్నాలు

By BBC News తెలుగు
|
బైడెన్, హారిస్

2020 నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ అంశంలో ఒక దర్యాప్తు కమిటీని నియమించేంతవరకూ జో బైడెన్ విజయాన్ని ఆమోదించేది లేదని కొందరు సెనేట్లు అంటున్నారు.

జనవరి 6న జరగాల్సిన ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్ల అధికారిక లెక్కింపును 10 రోజులు వాయిదా వేయాలని టెక్సస్ సెనేటర్ టెడ్ క్రూజ్ నేతృత్వంలోని 11 మంది సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ఎన్నికల చట్టం అమలులో ఉల్లంఘనలు జరిగాయని వీరు ఆరోపిస్తున్నారు.

అయితే, వీరి డిమాండ్‌ను అమెరికా పార్లమెంట్ ఆమోదించే సూచనలు కనిపించట్లేదు.

టెక్సస్ సెనేటర్ టెడ్ క్రూజ్

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా బైడెన్ విజయాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తూ వచ్చారు. ఓట్ల లెక్కింపులో మోసం జరిగిందని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలన్నిటినీ కోర్టు తోసిపుచ్చింది.

ఎలక్ట్రోరల్ కాలేజ్ ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ ఎలక్ట్రోరల్ ఓట్ల లెక్కింపులో లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 6న పార్లమెంట్‌లో రెండు గంటల పాటు చర్చ నిర్వహిస్తారు. ఆ తరువాత ఓటింగ్ ఉంటుంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ అధికారికంగా పూర్తి అవుతుంది.

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్‌కానల్, అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ

నాన్సీ పెలోసీ, మిచ్ మెక్‌కానల్ ఇళ్లపై అల్లరిమూక దాడి

అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్ మెజారిటీ లీడర్ మిచ్ మెక్‌కానల్ ఇళ్లపై అల్లరిమూక దాడి చేసింది.

కాలిఫోర్నియాలో పెలోసీ ఇంటిముందు నకిలీ రక్తపు మరకలు, ముక్కలుగా కోసిన పంది తల, గోడలపై రాతలు కనిపించాయని కథనాలు వచ్చాయి.

పిచ్చి గీతలతో పాటూ "నా డబ్బు ఎక్కడ (వేర్ ఈజ్ మై మనీ)" అని కెంటకీలోని మెక్‌కానల్ ఇంటి గోడలపై రాశారు.

కరోనావైరస్ ఉద్దీపన ప్యాకేజీ విషయంలో జరుగుతున్న రాజకీయ గొడవల నేపథ్యంలో అల్లరిమూకలు ఈ దాడికి పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు.

ఈ ప్యాకేజీలో భాగంగా అమెరికన్లకు అందిస్తున్న నగదు సాయాన్ని 600 డాలర్ల నుంచి 2,000 డాలర్లకు పెంచాలానే ప్రతిపాదనకు మంగళవారం అమెరికా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 40 మంది రిపబ్లికన్లు కూడా దీనికి ఆమోదం తెలుపడంతో డెమొక్రటిక్ నేతృత్వంలోని సభ ఈ బిల్లును పాస్ చేసింది.

అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పటికీ, రిపబ్లికన్లు మెజారిటీలో ఉన్న సెనేట్ దీనికి ఆమోదం తెలుపలేదు.

"రుణాలుగా తెచ్చిన సొమ్మును సహాయం అవసరం లేని డెమొక్రటిక్ శ్రేయోభిలాషుల చేతుల్లో పెట్టడానికి సెనేట్ అంగీకరించలేదు. ఈ విషయంలో సెనేట్ ఎలాంటి బెదిరింపులకు లొంగదు" అని మెక్‌కానల్ బుధవారం వ్యాఖ్యానించారు.

ఈ సంఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Last attempts by Republican senates to bring down Joe Biden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X