వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లీ వెన్‌లియాంగ్: కరోనావైరస్ గురించి మొట్టమొదట ప్రపంచానికి చాటి కేసులు ఎదుర్కొన్న చైనా డాక్టర్ వర్థంతి.. నివాళులర్పించిన ప్రజలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చైనాలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ గురించి వైద్యులు, ప్రజలను అప్రమత్తం చేసిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ను సంస్మరించుకుంటూ సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తాయి.

ఆయన వూహాన్‌లో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో తాను కూడా కోవిడ్-19 బారినపడి ఏడాది కిందట 2020 ఫిబ్రవరి 7న చనిపోయారు.

సార్స్ తరహాలో కనిపించే మరో ప్రాణాంతక వైరస్ వేగంగా వ్యాపిస్తోందంటూ తన సహ వైద్యులను హెచ్చరించటానికి డాక్టర్ లీ ప్రయత్నించారు.

అయితే.. ''తప్పుడు వ్యాఖ్యలు చేయటం ఆపాలి’’ అంటూ ఆయనను పోలీసులు హెచ్చరించారు. ''వదంతులు వ్యాపింపజేస్తున్నార’’నే అభియోగాలు నమోదుచేసి ఆయన మీద దర్యాప్తు కూడా చేపట్టారు.

ఆదివారం లీ ప్రథమ వర్థంతి

డాక్టర్ లీ.. వూహాన్‌లోని ఒక ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పనిచేసేవారు. కరోనావైరస్ మొట్టమొదటి కేసు 2019 చివర్లో మొట్టమొదటి సారిగా ఈ నగరంలోనే నమోదైంది.

డాక్టర్ లీ మరణంతో చైనాలో ప్రజల నుంచి సంతాపంతో పాటు.. మహమ్మారి విజృంభణపై ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం కూడా పెల్లుబికింది.

ఒకవైపు వూహాన్‌లో ఆస్పత్రులు నిండిపోతోంటే.. వైరస్ తీవ్రతను ప్రభుత్వం తక్కువగా చేసి చూపుతోందని, వ్యాప్తి విస్తృతిని దాచిపెడుతోందని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆగ్రహం పతాకస్థాయికి చేరటంతో డాక్టర్ లీ మీద బనాయించిన కేసులను ఎత్తివేసి, ఆయనను ధీరోదాత్తుడుగా గౌరవించింది చైనా ప్రభుత్వం.

అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందికి పైగా జనానికి కరోనావైరస్ సోకగా.. 23 లక్షల మంది చనిపోయారు.

చైనాలో వాక్‌స్వాతంత్ర్యం పరిమితంగా ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారిని ప్రభుత్వం విజయవంతంగా నింత్రించిందనే అధికారిక ప్రచారాన్ని ప్రభుత్వం సాగించింది.

సోషల్ మీడియాలో కామెంట్లను చైనా ప్రభుత్వం నిరంతరం సెన్సార్ చేస్తుంటుంది.

కానీ ట్విటర్ వంటి చైనా సోషల్ మీడియా వీబోలో డాక్టర్ లీ వ్యక్తిగత పేజీ.. జనం కరోనా మహమ్మారి వల్ల ఎదుర్కొంటున్న బాధావేదనలను వ్యక్తీకరించటానికి అరుదైన వేదికగా మారింది.

ఆయన పోస్టుల కింద కామెంట్ల విభాగంలో వేలాది మెసేజీలు పోస్టయ్యేవి.

శనివారం నాడు ఇంకా చాలా కామెంట్లు కనిపించాయి.

''డాక్టర్ లీ.. ప్రజలు, చరిత్ర మిమ్మల్ని ఎన్నడూ మరువరు’’ అని డాక్టర్ లీ చివరి పోస్టు కింద రాశారు.

''ఒక సంవత్సరం తర్వాత అందరూ మిమ్మల్ని మరచిపోతారని నేను అనుకున్నాను. నేను పొరబడ్డాను. చైనా ప్రజల గుండెల్లో మీరు శాశ్వతంగా జీవించి ఉంటారు’’ అని మరొకరు నివాళి అర్పించారు.

వూహాన్‌లో కూడా జనం నివాళులు అర్పిస్తున్నారు.

డాక్టర్ లీ పనిచేసిన ఆస్పత్రికి సమీపంలో నివసించే లీ పాన్ అనే వ్యక్తి.. ''ఈ వైరస్ గురించి తొలుత మాకు చెప్పినది ఆయనే. దానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయనకు తెలుసు. అయినాకానీ ఆయన ప్రమాద ఘంటికలు మోగించారు. అది చాలా సాహసోపేతం’’ అని రాయిటర్స్ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chinese doctor's first death anniversary, Chinese pays tributes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X