వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ జర్నలిస్ట్, లెజండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ చనిపోయారు. ఆయన సీఎన్ఎన్ న్యూస్ చానెల్ హోస్ట్‌గా చాలా ఏళ్లు పనిచేశారు. 'ల్యారీ కింగ్ లైవ్' అనే షో 25 ఏళ్ల పాటు నడిచింది. అధ్యక్ష అభ్యర్థులు, సెలబ్రిటీస్, అథ్లెట్స్, సినీ తారలను, సాధారణ ప్రజలను ఆయన ఇంటర్వ్యూ చేశారు. 2010లో తన షోకు ల్యారీ గుడ్ బై చెప్పారు. 25 ఏళ్లలో 6 వేల ఎపిసోడ్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.

legendary talk show host Larry King died

ల్యారీ అనారోగ్యంతో శనివారం ఉదయం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాన్స్ ధృవీకరించారు. తర్వాత ఫేస్‌బుక్‌లో పోస్ట్ కూడా చేశారు. కో ఫౌండర్, హోస్ట్, స్నేహితుడు ల్యారీ కింగ్ చనిపోయారని ఓరా మీడియా ప్రకటనలో తెలిపింది. ఆయన లాస్ ఏంజెల్స్‌లో గల సెడార్స్ సినాల్ మెడికల్ సెంటర్‌లో చనిపోయారని వెల్లడించింది. రెడియో, టీవీ, డిజిటల్ మీడియాలో ల్యారీ మంచి పేరు గడించారు. వేలాది ఇంటర్వ్యూలు చేసి మన్ననలు పొందారు. అవార్డులను అందుకున్నారు.

ల్యారీ మృతికి గల కారణం తెలియరాలేదు. ఎవరూ కూడా ఈ సమస్యతో చనిపోయారని ప్రకటించలేదు. అయితే వృద్దాప్య దశకు చేరుకొని.. 87 ఏళ్ల వయస్సులో సాధారణంగానే చనిపోయారని తెలుస్తోంది. గత డిసెంబర్ నెలలో ల్యారీకి కరోనా కూడా సోకింది. ల్యారీ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

English summary
Larry King, the longtime CNN host who became an icon through his interviews with countless newsmakers and his sartorial sensibilities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X