• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

36 కోట్ల విరాళం.. అమెజాన్ అడవుల పరిరక్షణకు హీరో చొరవ

|

లాస్‌ఏంజెల్స్‌‌ : ప్రపంచ మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాలిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అటు హాలీవుడ్ మొదలు ఇటు బాలీవుడ్, టాలీవుడ్ నటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మానవాళికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవులను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు. పచ్చని చెట్లను పరిరక్షిస్తూ, మొక్కలను విరివిగా నాటాలని కూడా సూచిస్తున్నారు. ఆ క్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, పర్యావేరణ వేత్త అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ విరాళం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అయితే మూడు వారాల నుంచి అమెజాన్ అడవులు కాలిపోతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Leonardo DiCaprio to donate 5 million dollars for Amazon rainforest aid

ప్రాజెక్టుల్లో అక్రమాలు అంటూ.. కేసీఆర్ కుటుంబం టార్గెట్.. విపక్ష నేతల ఫైట్..!

అమెజాన్‌ అడవుల పరిరక్షణ కోసం ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో ఐదు మిలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించారు. అంటే మన కరెన్సీలో దాదాపు 36 కోట్లు. ఆయన ఇటీవలే గత నెలలో ఎర్త్ అలయెన్స్ అనే పర్యావరణానికి సంబంధించిన ఫౌండేషన్ స్థాపించారు. అయితే తాను ఇచ్చే ఈ విరాళాన్ని అమెజాన్ అడవుల పరిరక్షణతో పాటు అక్కడి ప్రజల కోసం, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఉపయోగించాలని డిసైడయ్యారు. అంతేకాదు తన ఫాలోవర్స్‌ను కూడా సాయం చేయాల్సిందిగా కోరారు. ఎవరూ ఎంత విరాళం ఇచ్చినా సరే.. అమెజాన్ అడవుల కోసమే ఉపయోగిస్తామని ప్రకటించారు. ఆ మేరకు alliance.org/amazonfund వెబ్‌సైట్‌ ఫాలో కావాలని సూచించారు.

దాదాపు మూడు వారాల నుంచి అమెజాన్ అడవులు కాలిపోతున్నా.. మొదట్లో ఎవరూ పెద్దగా స్పందించలేదు. క్రమక్రమంగా సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేయడంతో ప్రపంచ వ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అందించే అమెజాన్ అడవులు కొద్ది రోజులుగా కాలిపోతుంటే మీడియా ఎందుకు పెద్దగా పట్టించుకోలేదని ప్రశ్నించారు డికాప్రియో. ఆ క్రమంలో ఆయన 36 కోట్ల భారీ విరాళం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hollywood star Leonardo DiCaprio's environmental initiative called Earth Alliance has pledged 5 million dollar towards the preservation of the Amazon rain forest following the wildfires. The new organisation's emergency Amazon Forest Fund is working to support local partners and indigenous communities in their efforts to protect the sensitive habitats within the Amazon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more