వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మాజీ భార్య దారుణ హత్య, ప్రధాని ప్రస్తుత భార్య కిల్లర్, ఫ్రెండ్ హత్య కేసు, తాజ్ మహల్ లో!

|
Google Oneindia TeluguNews

మాసెరు: లోసోథో దేశ ప్రధాని మాజీ భార్య హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ప్రధాని ప్రస్తుత భార్య మాజీ భార్యను దారుణంగా హత్య చేయించిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దక్షిణ ఆఫ్రికాలోని లోసోథో దేశం ప్రధాని థామస్ ధబానె మాజీ భార్య లివోలెలో హత్యకు గురైయ్యింది. ప్రధాని థామస్ ధబానె ప్రస్తుత భార్య, లోసోథో దేశం ప్రప్రథమ మహిళ మోయెసైహ్ ధబానె (42) మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

<strong>ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!</strong>ఆంటీతో అక్రమ సంబంధం, భార్యకు టార్చర్ పెట్టిన ఫేమస్ సింగర్, బంగారు, కట్నంతో జల్సాలు!

ప్రధాని మాజీ భార్య

ప్రధాని మాజీ భార్య

లోసోథో దేశం ప్రధాని థామస్ ధబానె భార్య లివోలెలో (58). 2012లో భర్త థామస్ ధబానెకు లివోలెలో దూరం అయ్యారు. అప్పటి నుంచి థామస్ ధబానె, లివోలెలో దంపతులు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ప్రధాని థామస్ ధబానె, లివోలెలో దంపతుల విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉంది.

ఇంటి ముందే తుపాకులతో కాల్చి!

ఇంటి ముందే తుపాకులతో కాల్చి!

2017 జూన్ నెలలో బయట పని ముగించుకుని ఇంటికి చేరుకుని కాంపౌండ్ బయట నిలబడి ఉన్న లివోలెలో మీద దుండగులు తుపాకులతో దారుణంగా కాల్చారు. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన లివోలెవో మీద తుపాకి గుళ్ల వర్షం కురిపించడంతో ఇంటి ముందు రోడ్డు మీద ఆమె కుప్పకూలి ప్రాణాలు విడిచారు. పక్కాప్లాన్ ప్రకారం ప్రధాని థామ్ ధబానె భార్య లివోలెలో దారుణ హత్యకు గురైయ్యిందని స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధాని ప్రస్తుత భార్య హంతకురాలు!

ప్రధాని ప్రస్తుత భార్య హంతకురాలు!

ప్రధాని థామస్ ధబానె ప్రస్తుత భార్య మోయెసైహ్ ధబానె (42). ప్రధాని థామస్ ధబానె మాజీ భార్య లివోలెలో దారుణ హత్యకు గురైన తరువాత మోయెసైహ్ హడలిపోయింది. జనవరి 10వ తేదీన మోయెసైహ్ దేశం విడిచి దక్షిణ ఆఫ్రికాకు పారిపోయారు. పోలీసులు కచ్చితంగా అరెస్టు చేస్తారని తెలుసుకున్న మోయెసైహ్ మంగళవారం స్వచ్చందంగా లోసోథ్ దేశం చేరుకుని పోలీసుల ముందు లొంగిపోయారు.

రెండు సార్లు ప్రధాని

రెండు సార్లు ప్రధాని

లోసోథ్ దేశానికి థామస్ ధబానె రెండు సార్లు ప్రధాని అయ్యారు. 2017లో జూన్ లో రెండవ సారి థామస్ ధబానె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి రెండు రోజుల ముందే ఆయన మాజీ భార్య లివోలెలో దారుణ హత్యకు గురైనారు. ఆ సమయంలో మాజీ భార్య హత్యకు గురి కావడంతో థామస్ ధబానె విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చెయ్యడంతో థామస్ ధబానె ప్రధాని పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారు.

హత్య తరువాత రెండు నెలలకు పెళ్లి

హత్య తరువాత రెండు నెలలకు పెళ్లి

మాజీ భార్య లివోలెలో హత్యకు గురైన రెండు నెలల తరువాత థామస్ ధబానె మోయెసైహ్ ధబానెను రెండవ వివాహం చేసుకున్నాడు. ప్రధాని థామస్ ధబానె మాజీ భార్య లివోలెలో హత్యతో పాటు ప్రస్తుత భార్య మోయెసైహ్ ధబానె ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు థాటో సిబోలాను హత్య చెయ్యడానికి ఆమె (ప్రధాని ప్రస్తుత భార్య) ప్రయత్నించిందని కేసు నమోదు అయ్యింది. ప్రధాని మాజీ భార్య హత్య కేసులో ప్రస్తుత భార్య మోయెసైహ్ తో పాటు మరో 8 మంది మీద కేసులు నమోదైనాయి. నిందితులు అందరూ ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాలో తలదాచుకున్నారని పోలీసులు అంటున్నారు.

20 లక్షల జనాభా

20 లక్షల జనాభా

దక్షిణ ఆఫ్రికాలో కింగ్ డమ్ ఆఫ్ లోసొథ్ అనే గుర్తింపు తెచ్చుకున్న దేశంలో 20 లక్షల మంది జనాభా ఉన్నారు. కేవలం 30,000 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న లోసోథ్ దేశానికి థామస్ ధబానె రెండుసార్లు ప్రధాని అయ్యారు. తన మాజీ భార్యను ప్రస్తుత భార్య దారుణంగా హత్య చేయించిందని తెలుసుకున్న ప్రధాని థామస్ ధబానె షాక్ కు గురైనారని ఆయన సన్నిహితులు అంటున్నారు. థామస్ ధబానె గతంలో భార్యతో కలిసి భారత్ లో పర్యటించారు.

English summary
First lady of Lesotho, Maesaiah has been charged with the killing of PM Thomas Thabane's former wife Lipolelo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X