వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాహోర్ హైకోర్టు సదస్సులో హఫీజ్ సయీద్ స్పీచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

LeT founder Hafiz Saeed addresses seminar in Lahore high court
లాహోర్: లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించిన తర్వాత కొద్ది రోజులకే ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టులో జరిగిన సదస్సులో ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగంలో అతను అమెరికా, భారతదేశాలపై విషం చిమ్మాడు.

నిషేద ఉగ్రవాద సంస్థ ఎల్ఇటి వ్యవస్థాపకుడు సయీద్ న్యాయవాదులను, ఇతరులను ఉద్దేశించి కోర్టు ఆవరణలో ప్రసంగించడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ పాకిస్తాన్‌లో సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.

అప్పుడు పాకిస్తాన్‌కు చెందిన అత్యంత ప్రధానమైన లాహోర్ హైకోర్టు బార్ ఆసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా అతను హాజరయ్యాడు. అతన్ని సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే ప్రతిపాదనను కొంత మంది న్యాయవాదులు వ్యతిరేకించారు కూడా.

పాకిస్తాన్ జస్టిస్ పార్టీ ఈసారి లాహోర్ హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో లష్కరే తోయిబా వ్యవప్థాపకుడు హఫీజ్ సయీద్ ప్రసంగించారు.

English summary

 Just days after his organisation was declared a terror outfit by the US, Jamaat-ud-Dawah chief Hafiz Saeed, who orchestrated the 2008 Mumbai terror attacks, addressed a seminar at the Lahore high court spewing venom on India and America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X