వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగ్దాదీ నిజంగానే మరణించాడా: నమ్మబుద్ధేయట్లేదంటోన్న పాకిస్తాన్ మాజీ!

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదీ ఆత్మహత్య చేసుకుని మరణించాడంటే పాకిస్తాన్ కు నమ్మబుద్ధేయట్లేదట. నిజంగానే అల్ బాగ్దాదీ మరణించాడా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తోందట. ఈ విషయాన్ని ఆ దేశా మాజీ హోమ్ శాఖ మంత్రి, ప్రస్తుత సెనెటర్ రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు. అతని మరణ వార్తను ఇస్లామిక్ స్టేట్స్ వెల్లడిస్తే గానీ తాను నమ్మలేనని అన్నారు. బాగ్దాదీ నిజంగానే చనిపోయి ఉంటే అది శుభవార్తే అవుతుందని అన్నారు. దీనిపై సోమవారం ఆయన ట్వీట్ చేశారు.

బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం నిజమే అయినప్పటికీ.. బాగ్దాదీ మరణించాడంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. దీనిపై ఐసిస్ నిర్దుష్ట ప్రకటన చేయాల్సి ఉందని చెప్పారు. బాగ్దాదీ మరణంపై ఐసిస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే తాను దీన్ని విశ్వసిస్తానని అన్నారు. సిరియాలో రాజకీయపరమైన గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈ నేపథ్యంలో బాగ్దాది చనిపోయాడనే వార్తలు వెలువడి ఉండొచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదివరకే బాగ్దాదీ హతమైనట్లు అనేక వార్తలు వచ్చాయని, అలా వార్తలు వచ్చిన ప్రతిసారీ అతను ప్రత్యక్షమయ్యేవాడని చెప్పారు.

Let us see if Baghdadi is really dead: Former Pakistan minister Rehman Malik

బాగ్దాదికి రక్షణగా వేలాదిమంది స్థానికులు ఉన్నారని, స్థానిక రాజకీయ నాయకుల అండదండలు సైతం ఉన్నాయని రెహ్మాన్ మాలిక్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అతను మరణించాడా? లేదా? అనేది ధృవకరించాల్సింది ఒక్క ఐసిస్ మాత్రమేనని చెప్పారు.గతంలో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించిన తరువాత..దానికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా బహిర్గతం చేసిందని గుర్తు చేశారు. అదే తరహాలో బాగ్దాదీ ఆపరేషన్ కు సమాచారాన్ని బయటి ప్రపంచానికి ఎందుకు తెలియనివ్వట్లేదని అన్నారు. ఐసిస్ నుంచి ఓ ప్రకటన త్వరలోనే వెలువడుతుందని చెప్పారు.

English summary
A former Pakistani minister has cast doubt on American assertions that Abu Bakr al-Baghdadi, the leader of the Islamic State, was killed in a raid led by US forces this weekend. Rehman Malik, a Pakistani senator and the former interior minister of the country, said he is yet to seen any "confirmation" from the IS on Baghdadi's death. "I am happy if he is dead... Let us see if he is killed in reality or not," Malik said in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X