వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన లిబియా: 33 మంది మృతి
ట్రిపోలి: లిబియా కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఈ ఘటనలో 33 మంది మరణించారు. రెండు కారు బాంబులు పేలాయి. 33 మంది మరణించడంతో పాటు 50 మంది గాయపడ్డారు.
లిబియా తూర్పు నగరం బెంగాజీలోని మసీదు వెలుపల తొలి పేలుడు సంభవించింది. రాత్రి 8.20 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. మసీదులో ప్రార్థనల తర్వాత ప్రజలు ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ పేలుడు సంభవించడంతో ప్రాణ నష్టం అధికంగా జరిగింది.

ఆ తర్వాత 10, 15 నిమిషాల వ్యవధిలోనే భద్రత, వైద్యాధికారులు వచ్చిన తర్వాత రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వీధి ఎదురుగా నిలిపిన మెర్సిడీస్ వాహనంలో సంభవించింది.
రెండో పేలుడు అంబులెన్స్‌ను కూడా తాకింది. మొదటి పేలుడులో కన్నా రెండో పేలుడులో ప్రాణ నష్టం అధికంగా జరిగింద. మృతుల్లో సైనికాధికారులతో పాటు పౌరులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.