వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా పోరులో వెలుగు బావుటా: స్విస్ ఆల్ప్ప్ పర్వతాలపై మెరిసిన త్రివర్ణ పతాకం: ప్రపంచం..సలాం

|
Google Oneindia TeluguNews

జెనీవా: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్‌ది రెండోస్థానం. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న అమెరికా సహా కొన్ని యూరప్ దేశాలతో పోల్చుకుంటే.. విస్తీర్ణంలో తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కరోనా వైరస్‌పై పోరాటాన్ని సాగించడంలో ఆయా దేశాల కంటే అద్భుత పనితీరును కనపరుస్తోంది. కరోనా వైరస్ నియంత్రణలో అభివృద్ధి చెందిన దేశాల కంటే అత్యుత్తమ ప్రదర్శన చేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదల, మృతుల సంఖ్య దీన్ని స్పష్టం చేస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణలో ప్రపంచ దేశాలకు ఓ చుక్కానిగా మారింది భారత్.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడంలో భారత్ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని కొనసాగిస్తోందని స్విట్జర్లాండ్ ప్రశంసలు కురిపించింది. తమ దేశంలో విస్తరించిన ఆల్ప్స్ పర్వత శ్రేణులపై మువ్వెన్నెల పతాకంతో కూడిన లైట్లను అమర్చింది. ఆల్ప్స్ పర్వత పంక్తుల్లోని మాటర్‌హార్న్ శిఖరంపై మనదేశ జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా వెలుగులను ప్రసరింపజేసింది. తెల్లని మంచు శిఖరం కొన్ని గంటల పాటు త్రివర్ణ పతాక రంగులతో వెలిగిపోయాయి. విద్యుత్ కాంతులతో మెరిసిపోయాయి.

సముద్ర మట్టం నుంచి 14,692 అడుగుల ఎత్తులో ఉంటుందీ మాటర్‌హార్న్ శిఖరం. కొన్ని అరుదైన సందర్భాల్లో స్విట్జర్లాండ్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆయా దేశాల జాతీయ పతాకాలతో కూడిన విద్యుద్దీప కాంతులను ఈ శిఖరంపై ప్రసరింపజేస్తుంటుంది. తాజాగా- మనదేశ మువ్వన్నెల పతాకాన్ని ఎంచుకుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కరోనా బారిన పడి.. పోరాడుతున్నాయి. అయినప్పటికీ.. భారత్‌నే ఎంపిక చేయడానికి ప్రధాన కారణం.. మనదేశం చూపుతోన్న పనితీరేనని స్విస్ చెబుతోంది.

Light projection of the tricolour on Matterhorn in Zermatt, Switzerland

కరోనా కోరల నుంచి భారత్ త్వరగా బయటపడుతుందని, దీనికోసం ప్రతి భారతీయుడు భాగస్వామి అయ్యారని ప్రశంసిస్తున్నారు. భారతీయుల్లో మనోధైర్యాన్ని నింపడానికి తమవంతు చేసిన ప్రయత్నమని పేర్కొన్నారు. లైట్ ఆర్టిస్ట్ గ్యారీ హాప్‌సెట్టర్ ప్రొజెక్టర్ ద్వారా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఫొటోగ్రాఫర్ గ్యాబ్రియెల్ దీన్ని క్లిక్ మనిపించారు. ఈ ఫొటోలను జెర్మాట్ మాటర్‌‌హార్న్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఫేస్‌బుక్ పేజీ, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లల్లో దీన్ని వైరల్ చేసింది.

English summary
Switzerland has expressed solidarity with India in its fight against the novel coronavirus pandemic. They did so by projecting the tricolour on the famous Matterhorn mountain in the Swiss Alps to give 'hope and strength' to all Indians. Swiss light artist Gerry Hofstetter has been lighting up the 4,478 meter pyramidal peak straddling between Switzerland and Italy with spectacular displays of flags of different countries and messages of hope as part of a nightly series supporting the nations combating the deadly Covid-19 pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X