వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాఢాంధకారంలో శ్వేతసౌధం: వైట్‌హౌస్‌లో లైట్లు ఆర్పివేత: అత్యంత అరుదుగా: దేనికి సంకేతం?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ దేశాధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ చీకట్లు కమ్ముకున్నాయి. గాఢాంధకారంలోకి వెళ్లింది. వైట్‌హౌస్‌లోని విద్యుత్ దీపాలను ఉద్దేశపూరకంగా ఆర్పివేశారు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతానికి నిరసనగా ఆ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్వేతసౌధంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్‌హౌస్ కామెంట్.. !క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్‌హౌస్ కామెంట్.. !

వైట్‌హౌస్ ఎదురుగా నిరసనలు కొనసాగుతున్న వేళ..

అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలాంటి చర్యలకు పూనుకుంటుంటారని చెబుతున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసగా విధ్వంసానికి దిగిన ఆఫ్రికన్ అమెరికన్లు రాజధాని వాషింగ్టన్ డీసీని సైతం వదిల పెట్టలేదు. వాషింగ్టన్‌లో గల అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం ఎదుట నిరసన ప్రదర్శనలను చేపట్టారు. బాటిళ్లు, ప్లకార్డులు సహా అందుబాటులో ఉన్న వస్తువులను వైట్‌హౌస్ మీదికి విసిరేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రత బలగాలు శాయశక్తులా కృషి చేసినప్పటికీ ఫలితం రాలేదు.

బంకర్‌లోకి తరలించిన సమయంలో..

బంకర్‌లోకి తరలించిన సమయంలో..

పరిస్థితులు అదుపు తప్పినట్టు గుర్తించిన వైట్‌హౌస్ సిబ్బంది డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబాన్ని అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి తరలించారు. ఆ సమయంలోనే లైట్లను ఆర్పివేశారు. వైట్‌హౌస్ చరిత్రలో అత్యంత అరుదైన సందర్భంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైట్‌హౌస్ సిబ్బంది లైట్లను ఆర్పివేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు. లైట్లను ఆర్పివేయాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అధ్యక్షుడు లేడనడానికి సంకేతంగా

అధ్యక్షుడు లేడనడానికి సంకేతంగా

వైట్‌హౌస్ లైట్లను ఆర్పివేయడం అంటే.. అధ్యక్షుడు లేరు అనే సంకేతాన్ని ఇచ్చినట్టవుతుందని అంటున్నారు. లైట్లు ఆర్పి ఉంచినంత సేపు ఆ దేశాధ్యక్ష పదవి ఖాళీగా ఉందనే సందేశాన్ని కూడా దీనిద్వారా ఇస్తారని, చరిత్రలో అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆ పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ప్రదర్శనకారుల నిరసలతో అట్టుడికిపోతోంది. వారిని నియంత్రించడానికి సైన్యాన్ని రంగంలోకి దింపారు ట్రంప్.

నైట్ విజన్ కోసమే

వైట్‌హౌస్‌లోని భద్రతాధికారులు చీకట్లోనూ చూడటానికి వీలు ఉన్న నైట్ విజన్ పరికరాలను వినియోగించాల్సి ఉన్నందున లైట్లను ఆర్పివేశారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆందోళనకారులను స్పష్టంగా గుర్తించడానికి లైట్లను ఆర్పివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఆధునిక అమెరికాలో ఎప్పుడూ లేనంతగా జాత్యహంకార దాడులు కొనసాగుతున్నాయి. అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయులకు మద్దతు లభిస్తోంది.

English summary
This wave of unrest was sparked by the death of a black man, George Floyd, in police custody last week in Minneapolis. Protests have spread from Minneapolis to New York and to Washington DC, where protesters marched on the White House from the city. Protests started out peacefully, and then escalated as state patrol was pulled in to reinforce local police forces. Footage from the scene shows barricades being moved, and police officers using tear gas on protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X