వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జార్విస్‌’ లాంటి సహాయకుడు కావాలి: జుకర్‌బర్గ్‌

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఈ ఏడాది(2016) తాను సాధించాల్సిన లక్ష్యం ఒకటి ఉందంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌. ప్రతి ఏడాది సరికొత్త లక్ష్యాలు పెట్టుకోవడం తనకు అలవాటని జుకర్‌ తెలిపారు.

అలాగే ఈ ఏడాది కూడా తాను ఏదో ఒకటి సాధించాలని.. అది పది మందికి ఉపయోగపడేది అయితే మరింత ఆనందాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది తాను ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్‌ బట్లర్‌ను తయారుచేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

'Like Jarvis in Iron Man': Zuckerberg unveils 2016 plans for AI butler

ఇంట్లోనూ, ఆఫీసులోనూ తన పనికి సహాయపడేలా ఈ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐరన్‌మ్యాన్‌ సినిమాలో ‘జార్విస్‌'లా ఆ పాత్ర ఉంటుందని జుకర్‌బర్గ్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికత సాయంతో తానే ఈ పాత్రను సృష్టించుకోనున్నట్లు మార్క్‌ వెల్లడించారు.

ఇంట్లో లైట్లు వేయడం, గది ఉష్ణోగ్రత నియంత్రించడం, సంగీతం పెట్టడం, మిత్రులు వస్తే వారి ముఖాలు గుర్తుపట్టి లోనికి ఆహ్వానించడం... లాంటివన్నీ తన కొత్త సహాయకుడు చేసి పెట్టాలని మార్క్‌ ఆకాంక్షిస్తున్నారు. ఇది తనకొక సవాల్ అని జుకర్ బర్గ్ అన్నారు. కాగా, గతంలో నెలలో 2 పుస్తకాలు చదవడం, మాండరీన్ నేర్చుకోవడం వంటివి నిర్దేశించుకుని పూర్తి చేశారు జుకర్ బర్గ్.

English summary
Mark Zuckerberg wants to build an artificially intelligent assistant in 2016 to help run his home and assist him at work, the Facebook founder and chief executive said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X