• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిల్‌క్లింటన్-మోనికాల మధ్య సెక్స్ ఎపిసోడ్‌ను బయటపెట్టిన ఆ మహిళ ఇకలేరు..!

|

మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్-మోనికా లెవిన్‌స్కీల మధ్య అక్రమ సంబంధం గురించి బహిర్గతం చేసిన మహిళ లిండా ట్రిప్ మృతిచెందారు. మృతి చెందేనాటికి ఆమె వయస్సు 70 ఏళ్లు. లిండా ట్రిప్‌ మృతిని ఆమె మాజీ లాయర్ జోసెఫ్ ముర్తా ధృవీకరించారు. లిండా గత కొంతకాలంగా పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. క్లింటన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకుముందు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్‌హౌజ్‌లో పనిచేశారు.

పెంటగాన్‌లో లెవిన్‌స్కీతో పరిచయం

పెంటగాన్‌లో లెవిన్‌స్కీతో పరిచయం

క్లింటన్ హయాంలో లిండా ట్రిప్ వైట్ హైజ్‌ నుంచి పెంటగాన్‌కు బదిలీ అయ్యారు. అక్కడే లిండాకు మోనికా లెవిన్‌స్కీతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య 24 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయినప్పటికీ ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఈ క్రమంలోనే బిల్ క్లింటన్‌తో తనకు శారీరక సంబంధం ఉందని మోనికా చెప్పడంతో ఆమెకు తెలియకుండా ఆ మాటలను రికార్డ్ చేశారు లిండా ట్రిప్. అయితే ఆ సమయంలో లిండా తనను నమ్మించి మోసం చేసిందని కన్నీటి పర్యంతమైంది మోనికా. లిండా గురించి తలుచుకుంటేనే ఆవేశం వస్తుందని మోనికా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించిందన్న వార్త బుధవారం రాగానే ఆమె కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు మోనికా.

సెక్స్ ఎపిసోడ్ గురించి మోనికా ప్రస్తావన

సెక్స్ ఎపిసోడ్ గురించి మోనికా ప్రస్తావన

లిండా ట్రిప్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో పలుమార్లు బిల్ క్లింటన్ గురించి మాట్లాడారు. బిల్‌క్లింటన్‌తో చాలాసార్లు శృంగారంలో పాల్గొన్నట్లుగా చెబుతున్న టేపులు ప్రకంపనాలు సృష్టించాయి. అంతేకాదు ఓసారి క్లింటన్‌తో శృంగారంలో పాల్గొన్న సమయంలో తాను ధరించిన నీలం రంగు డ్రెస్‌పై వీర్యం మరకలు ఇంకా ఉన్నాయని అది తాను భద్రంగా దాచుకున్నట్లు చెబుతున్న రికార్డులు కూడా బయటపడ్డాయి. ఇక ఈ ఆడియో టేపులను ట్రిప్.. కెన్‌స్టార్‌ అనే లాయరు వద్ద ఉంచడంతో క్లింటన్‌ పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ముందుగా వైట్‌హౌజ్ నుంచి ఇచ్చిన వివరణ ప్రకారం క్లింటన్ తాను ఎలాంటి తప్పు చేయలేదని వాపోయాడు. కానీ మోనికా ధరించిన నీలం రంగు డ్రెస్‌ గురించిన రికార్డులు బయటపడగానే క్లింటన్ నిస్సహాయత స్థితిలోకి వెళ్లిపోయారు.

  Parliament Adjourned : Jagan Govt Mulling Over AP Council Abolition, Budget, Capital Shifting
  అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న బిల్ క్లింటన్

  అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న బిల్ క్లింటన్

  1998లో క్లింటన్‌పై అభియోగాలు సీరియస్‌గా మారడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతినిధుల సభలో క్లింటన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా అక్కడ ఆయన గట్టెక్కారు. ఇక డెమొక్రాట్ల దృష్టిలో లిండా ట్రిప్ ఒక విలన్‌గా మారారు. అయితే రిపబ్లికన్లు మాత్రం ఆమెను ఒక హీరోగా అభివర్ణించారు. ఇక 1999లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయని కానీ మోనికా తనతో చెప్పిన మాటలు నిజమని వాటి రికార్డ్స్‌నే బయటపెట్టినట్లు లిండా చెప్పారు. తనకు నిజమనిపించిదే తాను చేసినట్లు లిండా ట్రిప్ సమర్థించుకున్నారు. 2001లో క్లింటన్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు. అక్కడి నుంచి ఆమె వర్జీనియాకు వెళ్లి సొంతంగా ఒక క్రిస్మస్ స్టోర్ నడుపుతూ జీవనం సాగించారు.

  English summary
  Linda Tripp, the Pentagon publicist whose secret recordings of Monica Lewinsky talking about sex with Bill Clinton led to the US President's impeachment in 1998, has died aged 70
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more