వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదికి 10మందిని గర్భవతులు చేస్తూ - ఇప్పటికే 150 మంది పిల్లలు - లాక్‌డౌన్‌లోనూ నేరుగా సెక్స్

|
Google Oneindia TeluguNews

తన ఒంట్లోని వీర్యమే అతని ఆయుధం... మహిళలతో సెక్స్ అదనంగా కలిసొచ్చే అవకాశం... ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడాదికి కనీసం 10 మంది ఆడవాళ్లను గర్భవతుల్ని చేస్తూ.. ఇప్పటికే 150 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు.. లాక్ డౌన్ దెబ్బకు ప్రపంచమంతా స్థంభించినా.. అతని సంతానోత్పత్తి ప్రక్రియ మాత్రం నిరాటంకంగా సాగుతూనే ఉంది.. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం.. ప్రపంచంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కన్న తండ్రిగా అతనిదే రికార్డు. 'మిర్రర్' పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సదరు వ్యక్తి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు..

జోయ్.. ది స్పెర్మ్ డోనార్..

జోయ్.. ది స్పెర్మ్ డోనార్..

అమెరికాలోని వెర్మాంట్‌కు చెందిన 49 ఏళ్ల జోయ్.. ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చిన వాడిగా రికార్డులకెక్కాడు. ప్రముఖ స్పెర్మ్ డోనార్ గా ఖ్యాతికెక్కిన ఇతని అసలు పేరేంటో ఎవరికీ తెలీదు. జోయ్ డోనార్ వ్యవహరించే ఈయన అందరు వీర్యదాతల్లాటి వాడు కాదు. సాధారణంగా ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనే మహిళలకు.. స్పెర్మ్ దాత గురించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. కానీ జోయ్ రూటే సపరేటు. అతను చేసిన స్పెర్మ్ దానాల్లో సగానికి పైగా నేరుగా సెక్స్ ద్వారా చేసినవి కావడం గమనార్హం.

ప్రధాని మోదీకి అత్యాధునిక విమానం - అమెరికా తయారీ బోయింగ్ బీ777 - ఢిల్లీకి ఎయిర్ ఇండియా వన్ప్రధాని మోదీకి అత్యాధునిక విమానం - అమెరికా తయారీ బోయింగ్ బీ777 - ఢిల్లీకి ఎయిర్ ఇండియా వన్

లాక్ డౌన్ లోనూ అదే పని..

లాక్ డౌన్ లోనూ అదే పని..

సాధారణంగా వీర్యదాతలు గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేస్తుంటారు. కానీ జోయ్ డోనార్ మాత్రం కొంచెం కూడా సిగ్గు పడకుండా తన సంపాదనా మార్గాన్ని బయటికి వెల్లడిస్తాడు. అరుదైన రీతిలో ఇటీవల ఓ పత్రికకు సైతం ఇంటర్వ్యూ ఇచ్చిన జోయ్ ఆసక్తికర విషయాలెన్నో చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌లో అంతా ఇళ్లకు పరిమితమైపోతే.. ఇతడు మాత్రం ఇతర మహిళలతో సెక్స్ లో పాల్గొంటూ, పిల్లల్ని కనాలనే వారి కలలను సాకారం చేసే పనిలో బిజీగా గడిపాడు. లాక్ డౌన్ తొలినాళ్లలో అర్జెంటీనాలో చిక్కుకుపోయానని, విమాన సర్వీసులు ప్రారంభమైన వెంటనే లండన్ కు చేరానని, వీర్యదానం కోసం ఎదురు చూస్తోన్న మహిళలు కూడా లండన్ కు రావడంతో అక్కడే సృష్టికార్యానికి దిగామని జోయ్ చెప్పాడు. లాక్‌డౌన్‌లో తాజాగా మరో 6 మంది పిల్లలకు తండ్రినయ్యానని, తద్వారా ఈ ఏడాదిలో 10 మందికి జన్మనిచ్చానని గర్వంగా చెప్పుకున్నాడు.

టార్గెట్ 2500 మంది పిల్లలు..

టార్గెట్ 2500 మంది పిల్లలు..

స్పెర్మ్ డొనేషన్ నే ప్రొఫెషన్ గా మార్చుకున్న జోయ్.. దాన్నొక సామాజిక సేవలా భావిస్తూ, పనిలో పనిగా పడక సుఖాన్ని పొందుతూ ఇప్పటికే 150 మంది పిల్లకు తండ్రయ్యాడు. మిగతా పురుషులకు భిన్నంగా తన జీవితంలో 2500 మంది పిల్లల్ని కనాలని టార్గెట్ పెట్టుకున్నాడు. నిజంగా అది సాధ్యమవుతుందా? అనే ప్రశ్న మాత్రం జోయ్ ని అడగొద్దట. ఎందుకంటే 2500 మంది పిల్లల్ని కనడానికి అతనికి కనీసం 250 సంవత్సరాలు పడుతుంది. టార్గెట్ సాధ్యంకాని పక్షంలో వయసు 90 ఏళ్లు వచ్చేదాకైనా తనలో సెక్స్ సామర్థ్యం తగ్గకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాడు.

Recommended Video

Donald Trump Blames India And China | కొవిడ్‌ మరణాల్లో భారత్‌ది తప్పుడు లెక్క: ట్రంప్‌ || Oneindia
వ్రతంతోపాటే సుఖం..

వ్రతంతోపాటే సుఖం..

వ్రతం చెడ్డా సుఖం దక్కాలన్నది భారతీయ సామెత. ఈ అమెరికన్ జోయ్ డోనార్ మాత్రం పిల్లల్ని పుట్టించే వ్రతంతోపాటే పడక సుఖాన్ని కూడా పొందుతున్నాడు. ‘‘నాకు ప్రపంచవ్యాప్తంగా 150 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది తాజాగా మరో ఆరుగురిని గర్భవతులను చేశా. ఏడాదికి కనీసం 10 మందిని తల్లులను చేయాలనేది నా ప్లాన్. కరోనా వైరస్, కొవిడ్ లాక్ డౌన్ నా పనిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా, గతంలో కంటే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా. నా పోలికలతో పుట్టే పిల్లలను చూస్తే, చాలా ఆనందం కలుగుతుంది. తరచూ వాళ్లను కలుస్తుంటాను'' అనిజోయ్ చెప్పుకొచ్చాడు.

English summary
A sperm donor from the US, who is popular for having fathered 150 kids, said that lockdown has not slowed him down as he has fathered 6 more during the period. The man who goes by the name Joe Donor says lockdown restrictions haven't slowed him down as he has kept himself busy during this period. He said five women are currently carrying his babies, with one giving birth earlier this year. If all deliveries happen as per schedule, Joe will have fathered 10 babies in 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X