వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెకండ్ వేవ్‌తో భయపెడుతున్న కరోనా... లండన్‌లో మళ్లీ లాక్ డౌన్... ఫ్రాన్స్‌లో కర్ఫ్యూ విధింపు...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్రిటన్ రాజధాని లండన్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు. శుక్రవారం(అక్టోబర్ 16) అర్ధరాత్రి తర్వాత నుంచి నగరంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూకె హెల్త్ సెక్రటరీ మట్ హన్‌కాక్ తెలిపారు. రెండు నుంచి మూడు వారాల పాటు లాక్ డౌన్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

లండన్ లాక్ డౌన్ రూల్స్...

లండన్ లాక్ డౌన్ రూల్స్...

తాజా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం... లండన్‌ వాసులు ఇతరుల ఇళ్లకు వెళ్లడం లేదా ఇతరులను తమ ఇంటికి ఆహ్వానించడం నిషేధం. ఇండోర్స్‌,అవుడ్ డోర్స్‌లో సమూహ సమావేశాలు నిషేధం. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లరాదు. అది కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కాకుండా కాలినడకన లేదా సైకిల్‌పై మాత్రమే వెళ్లాలి. బిజీ టైమింగ్స్‌ను,రద్దీగా ఉండే మార్గాలను అవైడ్ చేయాలి.
స్కూళ్లు,యూనివర్సిటీలు,ప్రార్థనా మందిరాలు తెరిచే ఉంటాయి. వివాహాలు,అంత్యక్రియలు వంటి కార్యక్రమాలను తక్కువమందితో నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. అయితే కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పబ్స్,రెస్టారెంట్స్ కూడా తెరిచే ఉంటాయి. అవుట్ డోర్స్‌ సమావేశాల్లో ఎక్కడైనా సరే ఆరుగురికి మించి ఉండరాదు.

పరిస్థితి సీరియస్‌....

పరిస్థితి సీరియస్‌....

9మిలియన్ల జనాభా ఉన్న లండన్ నగరంలో ప్రస్తుత పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని... దీన్ని కట్టడి చేయాలంటే ఆంక్షలు తప్పనిసరి అన్నారు హెల్త్ సెక్రటరీ హన్‌కాక్. లేదంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి లండన్ వాసులంతా తాజా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మాట్లాడుతూ... ఇలాంటి నిబంధనలు ఎవరికీ ఇష్టం లేనప్పటికీ... మనల్ని మనం కాపాడుకోవడానికి వీటిని పాటించక తప్పదన్నారు.

ఫ్రాన్స్‌లో కర్ఫ్యూ ఆంక్షలు

ఫ్రాన్స్‌లో కర్ఫ్యూ ఆంక్షలు

యూకెలో ఇప్పటివరకు 6,73,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 43,293 మంది మృతి చెందారు. ఇందులో లండన్‌లో 39,419 కేసులు నమోదవగా.. ఇప్పటివరకూ 6885 మంది మృతి చెందారు. నగరంలో ఇన్ఫెక్షన్ రేటు వేగంగా పెరుగుతుండటంతో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మంది వైరస్ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లండన్ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. మరో యూరోప్ దేశం ఫ్రాన్స్‌లోనూ కరోనా కట్టడికి ఆంక్షలు విధించారు. ప్యారిస్ సహా అన్ని పెద్ద నగరాల్లో ఉదయం 9గం. నుంచి రాత్రి 9గం. వరకు కర్ఫ్యూ విధించారు. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకూ 7,56,472 కరోనా కేసులు నమోదవగా 32,942 మరణాలు సంభవించాయి. అక్టోబర్ 10న అత్యధికంగా 27వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సెకండ్ వేవ్ తీవ్రమవుతుండటంతో తాజా ఆంక్షలు అమలులోకి తెచ్చారు.

Recommended Video

G Kishan Reddy @AIIMS - ఎయిమ్స్ నిర్మాణానికి భూమి కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు!!

English summary
To tackle the ongoing coronavirus pandemic, Boris Johnson has introduced a "'Local Covid Alert Levels" in England. This works like a traffic light system, there will be three tiers - medium, high and very high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X