వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. భయంతో లండన్ ఎయిర్‌పోర్టు మూసివేత!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లండన్: సిటీ ఎయిర్‌పోర్టు రన్‌ వే సమీపంలో శక్తివంతమైన బాంబు కనిపించడంతో లండన్ నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆదివారం థేమ్స్ నది ఒడ్డున కింగ్ అయిదో జార్జి డాక్ వద్ద నిర్మాణ పనులు చేపడుతున్న సమయలో ఈ బాంబు బయటపడింది. ఈ ప్రాంతం సిటీ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉండడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.

London City Airport Closed After World War II Bomb Found

ప్రయాణికులను బయటికి పంపిచివేసి ఆ బాంబును తొలగించే ప్రయత్నం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా సెప్టెంబరు 1940, 1941 మే నెలల మధ్యన లండన్ నగరంపై జర్మన్ ఎయిర్‌ఫోర్స్ దళాలు వేల సంఖ్యలో బాంబులను జార విడిచాయి.

వాటిలో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చని, శక్తివంతమైన ఆ బాంబు అక్కడ పడి పేలకుండా ఉండి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్ సిటీ ఎయిర్‌పోర్టు అధికారులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు.

English summary
London City Airport announced its closure on Sunday after a World War Two bomb was discovered in the nearby River Thames. The ordnance was discovered in King George V Dock, close to the runway of London's most central airport, during planned works. Travellers were told to avoid the airport: "All passengers due to travel from London City on Monday are advised to contact their airline for further information." City Airport operates short-haul flights and is located in east London, close to the Canary Wharf business district. The unexploded ordnance is being dealt with by specialist police officers working alongside the Royal Navy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X