వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెసేజ్: వీధిలో దుస్తులిప్పేసిన యువతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

లండన్: ఓ యువతి తనకు వచ్చిన వినూత్న ఆలోచనతో ప్రపంచానికి సందేశం ఇవ్వాలనుకుంది. ఇందుకోసం ఆమె తనపై ఉన్న దుస్తులిప్పేసి వీధిలో నిలబడింది. తనలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మద్దతు పలకాలని పిలుపునిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది తమ శరీరాకృతిని ఇష్టపడరని ‘2012 సెంటర్ ఫర్ అప్పీయరెన్స్' సర్వేలో వెల్లడైంది. అయితే ఆ సమస్య నుంచి బయట పడ్డ ఈ యువతి. తమ శరీరం ఆకృతి గురించి బాధపడుతున్న వారికోసం ఈ వినూత్న ప్రదర్శన చేపట్టింది.

'ఈటింగ్ డిజార్డర్'(ఎప్పుడూ ఏదో తినాలనిపిస్తుండటం లేక అసలే తినలేక పోవడం) నుంచి బయటపడ్డ జే వెస్ట్ అనే ఈ యువతి రద్దీగా ఉండే లండన్ పికాడిలి సర్కస్ కూడలిలో కళ్లకు గంతలు కట్టుకొని పై దుస్తులను విప్పేసిసి నిలబడింది. అంతేగాక, తన పక్కకి ఒక ఫ్లకార్డును కూడా పెట్టింది.

London Girl Strips Down on Street To Send Powerful Message To The World

ఎవరైతే ఈటింగ్ డిజార్డర్, ఆత్మగౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారికోసమో ఇలా నిలుచున్నానని ఆమె అందులో పేర్కొంది. ఎవరైనా తనలాంటి వారందరికి అండగా ఉండాలనుకుంటే 'లవ్ సింబల్(ప్రేమ గుర్తు)'తో తన శరీరంపైన రాయాలని ఆ ఫ్లకార్డుపై రాసి ఉంచింది.

ఆ తర్వాత ఆమె ఇలా లో దుస్తులతో నిలబడి ఉన్నప్పుడు.. అండగా ఉంటామని వచ్చిన వారు ఆమె శరీరంపై రాస్తున్నపుడు తీసిన వీడియోని ఆన్‌లైన్‌లో పెట్టింది. దీంతో ఆ వీడియోని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తిలకించి జే వెస్ట్‌కి, ఆమె ఎదుర్కొన్న సమస్యతో బాధపడుతున్న వారికి అండగా ఉంటామంటూ లైక్‌లు కొట్టారు.

English summary
Jae West is a young girl from London, passionate about endorsing self-acceptance and body image after going through an eating disorder issue herself while in high school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X