వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయంకర వ్యాధిని గెలిచాడు .. జన్యు పోలికల శస్త్రచికిత్సతో హెచ్ఐవీ దూరం ...

|
Google Oneindia TeluguNews

లండన్ : ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏటేటా హెచ్ఐవీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శాస్త్ర, సాంకేతిక పరిజానం ఎంత పెరిగినా హెచ్ఐవీ పాజిటివ్ కు మందులు కనుగొనలేకపోయారు మన శాస్త్రవేత్తలు. కానీ జన్యుపరంగా చేసిన ఓ శాస్త్రచికిత్సతో హెచ్ఐవీ పాజిటివ్ నుంచి విముక్తి కలగడం ఆలోచింపజేస్తోంది. ఇదేవిధంగా పాజిటివ్ ఉన్నవారికి శస్త్ర చికిత్స చేయొచ్చా ? సరికొత్త పరిశోధనలో హెచ్ఐవీకి చెక్ పెట్టొచ్చా ? భవిష్యత్ లో హెచ్ఐవీ పాజిటివ్ కు శాస్త్రవేత్తలు మందు కనిపెట్టగలరా ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

చాపకింద నీరులా వ్యాప్తి ..

చాపకింద నీరులా వ్యాప్తి ..

హ్యుమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ ..హెచ్ ఐ వీ 1980లో బయటపడింది. ఆఫ్రికా దేశాల్లో బయటపడిన వ్యాధి .. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మందికి సోకింది. వీరిలో 35 మిలియన్ల రోగులు ప్రాణాలు కోల్పోయారనే నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారి మరింత మందిని బలి తీసుకుంటుందోనని భయం వెంటాడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరులకు ఆయా దేశాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఎయిడ్స్ వ్యాధికి మందు లేకపోవడంతో ఏటేటా మృతుల సంఖ్య పెరుగుతోంది.

 సుసాధ్యమైన అసాధ్యం ..

సుసాధ్యమైన అసాధ్యం ..

ఎయిడ్స్ మహమ్మారి అగ్రరాజ్యాలను కూడా వణికించాయి. ఆయా దేశాల మేధావులు కూడా సరైన మందు కనుగొనలేక .. నివారణ ఒక్కటే మార్గమని సూచించడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ ఇటీవల లండన్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఎయిడ్స్ నివారణే సాధ్యమే అనే వాదనకు బలం చేకూర్చింది. 2003లో ఓ వ్యక్తికి హెచ్ఐవీ సోకింది. వ్యాధితో బాధపడుతున్న అతను 2012లో హాడ్కిన్స్ లింపోమా అనే బ్లడ్ క్యాన్సర్ బారినపడ్డారు. 2016 నాటికి వ్యాధి బాగా ముదిరిపోయింది. దీంతో రోగి జన్యుపోలికలు ఉన్న మరో వ్యక్తి నుంచి ఎముక మజ్జ మార్పిడి చేశారు. అప్పటి నుంచి 18 నెలలపాటు రోగికి యాంటీ రెట్రో వైరల్ మందులు ఇచ్చారు. ఆపరేషన్ జరిగిన మూడేళ్ల తర్వాత అతని శరీరంలో హెచ్ఐవీ జాడ ఎక్కడా కనపించలేదు. ఈ విషయాన్ని అతనికి వైద్యం అందిస్తున్న వైద్యుడు రవీంద్ర గుప్తా వెల్లడించారు. ఈ విధంగా ఇదివరకు కూడా తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి హెచ్ఐవీ వ్యాధి నుంచి బయటపడ్డారు. ఎముక మజ్జకు శస్త్రచికిత్సతో .. రెండో వ్యక్తిగా లండన్ కు చెందిన రోగి నిలిచాడు.

అందరికీ సాధ్యం కాదు ..

అందరికీ సాధ్యం కాదు ..

అమెరికాకు చెందిన తిమోతీకి హెచ్ఐవీ సోకింది. ఆయన 2007లో జర్మనీలో జన్యు పోలికల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని శరీరంలో హెచ్ఐవీ పాజిటివ్ కాస్త నెగిటివ్ గా మారింది. తిమోతీ, లండన్ వ్యక్తి లాగా అందరికీ ఈ విధంగా వైద్యం చేయలేదని డాక్టర్లు చెప్తున్నారు. ఇందుకోసం ఎంతో వ్యయప్రయాసలు పడాల్సి ఉంటుందని .. దానికితోడు జన్యుపోలికలు ఉన్న వ్యక్తులు అంత ఈజీగా దొరకరని తెలిపారు. ఈ విధానంలో ఒకరిద్దరికీ నయమైందని .. అందరికీ ఇదే విధానంలో బాగా చేయలేమంటున్నారు. కొత్త విధానాలు అవలంభిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

ఆటలో మునిగాడు .. మంచినీరనుకొని యాసిడ్ తాగాడు .. మధ్యప్రదేశ్ లో కలకలంఆటలో మునిగాడు .. మంచినీరనుకొని యాసిడ్ తాగాడు .. మధ్యప్రదేశ్ లో కలకలం

నివారణ భవిష్యత్ లో సాధ్యమే ..

నివారణ భవిష్యత్ లో సాధ్యమే ..

హెచ్ఐవీ వైరస్ నివారణ కోసం శాస్త్రవేత్తలు ఏళ్లుగా కృషి చేస్తున్నారు. అయినా ఎలాంటి పురోగతి సాధించలేదు. ఇన్నాళ్లకు జన్యపర శస్త్ర చికిత్సతో అసాధ్యం సుసాధ్యమైంది. దీనికి అనుగుణంగా పరిశోధనలు చేసి .. భవిష్యత్ లో హెచ్ ఐ వీ కి మందును శాస్త్రవేత్తలు కనుగొనగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
An HIV-positive man in Britain has become the second known adult worldwide to be cleared of the AIDS virus after he received a bone marrow transplant from an HIV resistant donor, his doctors said. Almost three years after receiving bone marrow stem cells from a donor with a rare genetic mutation that resists HIV infection - and more than 18 months after coming off antiretroviral drugs - highly sensitive tests still show no trace of the man’s previous HIV infection. “There is no virus there that we can measure. We can’t detect anything,” said Ravindra Gupta, a professor and HIV biologist who co-led a team of doctors treating the man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X