వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తితో యువకుడి వీరంగం: బెల్ట్ బాంబు ఉందంటూ బెదిరింపు: ఉగ్రవాదిగా అనుమానం.. కాల్చివేత..!

|
Google Oneindia TeluguNews

లండన్: లండన్‌లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పాదాచారులపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తాను బెల్ట్ బాంబును ధరించానని, తనను తాను పేల్చేసుకుంటాననీ బెదిరించాడు. నడుముకు ధరించిన డమ్మీ బెల్ట్ బాంబును ప్రదర్శిస్తూ బీభత్సాన్ని సృష్టించాడు. ముగ్గురిని గాయపరిచాడు. అతణ్ని ఉగ్రవాదిగా అనుమానించిన పోలీసులు.. కాల్చి చంపారు. లండన్ దక్షిణ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని సుదేష్ మమ్మూర్ ఫరాజ్ అమ్మాన్‌గా గుర్తించారు. అతని నేపథ్యంపై ఆరా తీస్తున్నారు.

 లండన్ బ్రిడ్జి తరహాలోనే..

లండన్ బ్రిడ్జి తరహాలోనే..

సరిగ్గా మూడు నెలల కిందట ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. లండన్ బ్రిడ్జిపై కత్తితో దాడి చేసిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోయాయనే ఉద్దేశంతో లండన్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మరోసారి అదే తరహా ఘటన చోటు చేసుకుంది. లండన్ దక్షిణ ప్రాంతంలో ఫరాజ్ అమ్మాన్..కత్తితో చెలరేగిపోయాడు. స్ట్రీథమ్ ప్రాంతంలో ఓ మహిళ సహా ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు.

డమ్మీ బెల్ట్ బాంబుతో..

డమ్మీ బెల్ట్ బాంబుతో..

ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫరాజ్ అమ్మాన్‌ను లొంగిపోవాల్సిందిగా ఆదేశించారు. అయినప్పటికీ.. అతను వినిపించుకోకపోవడంతో కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు ఫరాజ్ శరీరంలోకి దూసుకెళ్లాయి. అతను అక్కడికక్కడే మరణించాడు. అతని నడుముకు ఉన్న బెల్ట్ బాంబును పరిశీలించగా.. అది డమ్మీదని తేలింది.

ఉగ్రదాడిగా అనుమానం..

ఉగ్రదాడిగా అనుమానం..

డమ్మీ బెల్ట్ బాంబును ధరించి, కత్తితో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నామని లండన్ మెట్రో పాలిటన్ డిప్యూటీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ల్యూసీ డీ ఒర్సి తెలిపారు. ఫరాజ్ అమ్మన్‌కు 20 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని, అతను ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇంకా తేలాల్సి ఉందని చెప్పారు. ఈ ఉదంతాన్ని తాము ఉగ్రదాడిగానే పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఫరాజ్ అమ్మాన్ నేపథ్యం గురించి ఆరా తీయాల్సి ఉందని, ఉగ్రవాదులు లేదా ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు.

English summary
A man armed with a knife and wearing a fake explosive device strapped to his body was shot and killed by the police in South London on Sunday after he was suspected of stabbing people on Sunday. The shooting occurred after people were stabbed in South London. The motive was unclear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X