వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన పట్టిందల్లా బంగారమే! ఒక్కరోజులో రూ.25 వేల కోట్లు!!

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్‌ పట్టిందల్లా బంగారమే అవుతోంది. తాజా గణాంకాల ప్రకారం జుకెర్ బర్గ్ సంపద 72.7 బిలియన్ డాలర్లకు చేరింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్‌ పట్టిందల్లా బంగారమే అవుతోంది. సోషల్ మీడియాలో అగ్రగామిగా దూసుకుపోతుండడంతో ఆయన సంపద కూడా పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతోంది.

తాజాగా గురువారం ఒక్క రోజులోనే ఆయన ఖాతాలో 3.8 బిలియన్ డాలర్లు వచ్చిపడ్డాయి. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.25 వేల కోట్లు! ఆదాయంపై సానుకూల నివేదిక వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షేర్లు అమాంతం 4 శాతానికి పైగా ఎగిసిపడ్డాయి. షేరు ధర రికార్డు స్థాయిలో 173 డాలర్లకు చేరింది.

Look Out, Bezos: Mark Zuckerberg Is Now the World’s Fifth Richest Person

తాజా గణాంకాల ప్రకారం జుకెర్ బర్గ్ సంపద 72.7 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఐదో స్థానంలో నిలిచినట్టు 'ఫోర్బ్స్' సంస్థ వెల్లడించింది.

నెం.1గా కాసేపు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్

ప‌్ర‌పంచంలో అత్యంత ధ‌న‌వంతుడిగా నిలిచిన‌ అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ కొన్ని గంట‌లపాటు ఆ స్థానంలో కొనసాగారు. అమెజాన్ షేర్లు భారీగా పెర‌గ‌డంతో కొన్ని గంట‌ల పాటు బెజోస్‌.. గేట్స్‌ను వెన‌క్కి నెట్టాడు. త‌మ రియ‌ల్‌టైమ్ ట్రాకింగ్ ప్ర‌కారం 90.5 బిలియ‌న్ డాల‌ర్ల‌తో బెజోస్ తొలి స్థానంలో నిలిచిన‌ట్లు ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టివ‌ర‌కు ఆన్‌లైన్ రీటెయిల‌ర్‌గానే ఉన్న అమెజాన్.. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్‌, ఆన్‌లైన్ వీడియో, కంప్యూట‌ర్ హార్డ్‌వేర్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ల‌కూ విస్త‌రించింది. అమెజాన్‌లో బెజోస్‌కు 17 శాతం ఈక్విటీ ఉంది. గ‌త నాలుగు నెల‌ల్లో అమెజాన్ షేర్లు 24 శాతం పెర‌గ‌డంతో బెజోస్ సంప‌ద కూడా భారీగా పెరిగింది.

మళ్లీ ప్రపంచ ధనవంతుడిగా బిల్ గేట్స్...

అయితే కొన్ని గంట‌ల్లోనే అమెజాన్ షేర్ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ త‌న నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కోల్పోయాడు. మళ్లీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (90 బిలియ‌న్ డాల‌ర్లు) తొలి స్థానానికి వ‌చ్చిన‌ట్లు ఫోర్బ్స్ సంస్థ స్ప‌ష్టం చేసింది. గేట్స్‌ను మించి స్థిరంగా ప్రథమ స్థానంలో ఉండాలంటే మాత్రం జెఫ్ బెజోస్ మ‌రికొంత కాలం ఆగాల్సిందేనట. గ‌త 22 ఏళ్ల‌లో 18 ఏళ్లు బిల్ గేట్సే నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ట్లు ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది.

English summary
Mark Zuckerberg’s wealth has hit a new milestone. After Facebook released a strong second-quarter earnings report on Wednesday, the company’s stock shot up 6% early Thursday to reach a record high. And while this would be good news under any circumstances, the jump also helped Facebook’s CEO reach a significant personal milestone. Zuckerberg’s net worth hit $72.7 billion on Thursday, according to Forbes’ real-time rankings of the world’s billionaires. This increase of more than $3 billion sent him past Mexico's Carlos Slim to become the world’s fifth-richest person. Amazon’s Jeff Bezos also saw his fortune rise on Thursday, passing Bill Gates to become the richest person in the world before Amazon's earnings report dropped Thursday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X