వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్‌లో కొత్త ట్విస్ట్: పేషెంట్లకు వాసన, రుచి తెలియట్లేదంటే..మృత్యువు సమీపించినట్టేనట

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భయానక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త అంశాన్ని కనిపెట్టారు. కరోనా వైరస్ సోకిన పేషెంట్..క్రమంగా వాసనను కోల్పోతారని, రుచి తెలియకుండా పోతుందని తేల్చారు. దీనిపై హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అమెరికాలో లక్షా 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందడానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా నిర్వహించిన సర్వే సందర్భంగా ఈ విషయం వెలుగు చూసిందని తేలింది.

అత్యంత ప్రమాదకర దశగా..

అత్యంత ప్రమాదకర దశగా..

దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలతో కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు క్రమంగా వాసన, రుచి తెలియకుండా పోతుందని, ఆ దశకు చేరితే వారి ప్రాణానికే ప్రమాదమని హ్యూస్టన్ పరిశోధకులు వెలువడించిన ఓ నివేదిక స్పష్టం చేసింది. ఈ దశకు చేరుకోవడం అంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నట్లుగా భావించవచ్చని శాస్త్రవేత్తలు తమ నివేదికలో పొందుపరిచారు. అమెరికాలోని వేర్వేరు ఆసుపత్రులు, ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో చికిత్స పొందుతోన్న పేషెంట్లను కలిసిన తరువాతే.. ఈ విషయాన్ని నిర్ధారించుకున్నామని తెలిపారు.

పేషెంట్ల ఆరోగ్య స్థితులను ఆరా తీయడానికి

పేషెంట్ల ఆరోగ్య స్థితులను ఆరా తీయడానికి

కరోనా వైరస్ సోకిన పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీయడానికి పలువురిని తాము ప్రత్యక్షంగా కలిశామని, వారి అభిప్రాయాలతో ఈ నివేదికను రూపొందించినట్లు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఒటొలారింగానాలజీ విభాగాధిపతి జేమ్స్ సీ డెన్నినీ వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేషెంట్లకు అందజేసే వైద్య చికిత్సలో వాసన, రుచి చూడటానికి ఉద్దేశించిన అనాస్మియా, డిస్గేసియా మందులను చేర్చినట్లు వివరించారు.

కొన్ని రకాల అలర్జీలు కూడా..

కొన్ని రకాల అలర్జీలు కూడా..

కరోనా వైరస్ పేషెంట్లు తుదిరోజుల్లో ఉన్నారనుకునే సమయంలో వారికి కొన్ని రకాల అలర్జీలు కూడా ఇబ్బందులు పెడతాయని డెన్నిని వెల్లడించారు. సైనస్ ఇన్ఫెక్షన్స్ లేదా జలుబు సోకవచ్చని వారు అభిప్రాయపడ్డారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండే పేషెంట్లు ఈ సమాచారాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. అలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తమ వాసన, రుచి చూసే శక్తిని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలని సూచించారు.

English summary
Houston A loss of smell and taste may be the early symptom of COVID-19 infection, according to the latest report by a leading American professional association of medical specialists. There have been reports of taste and smell disorders related to COVID-19. From multiple countries around the world as well as within the US, said James C Denneny III, MD, executive vice president and CEO of the American Academy of Otolaryngology-Head and Neck Surgery (AAO-HNS).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X