వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్: ఆస్పత్రిలో ఉండగా తెలిసిందంటూ డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనకు కరోనా సోకినప్పటికీ తన ఆరోగ్యంలో ఏమీ తేడా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ తన ఊపిరితిత్తుల్లో చిన్న ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు గుర్తించారని వెల్లడించారు.

భారత్‌పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ అక్కసు: జో బైడెన్ గెలిస్తే హంతకులు దేశంలోకి అంటూ ఫైర్భారత్‌పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ అక్కసు: జో బైడెన్ గెలిస్తే హంతకులు దేశంలోకి అంటూ ఫైర్

గురువారం రాత్రి టౌన్ హాల్ స్టైల్‌లో జరిగిన ఎన్బీసీ సమావేశంలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. డిమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కూడా ఇదే సమయంలో మరో నెట్‌వర్క్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

 lungs were ‘a little bit infected’ when I was hospitalised: Donald Trump

కాగా, స్టేజీపై డొనాల్డ్ ట్రంప్ మాస్కు లేకుండానే కూర్చోవడం గమనార్హం. అయితే, అతనికి కొంతదూరంలో పలువురు ఓటర్లు మాస్కులు ధరించి కూర్చున్నారు.
గత వారం జరిగిన డిబేట్ అనంతరం ట్రంప్ కరోనా టెస్టు చేసుకోవడం, ఆయనకి కరోనా సోకినట్లు తేలడం జరిగింది.

అయితే, కొద్ది రోజులకే ఆయన తనకు కరోనా నెగిటివ్ వచ్చినట్లు బహిరంగ ప్రదేశాల్లో పర్యటించడం మొదలుపెట్టారు. అయితే, ట్రంప్‌కు కరోనా నేపథ్యంలో రెండో డిబేట్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లు వేదికలోనైనా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

Recommended Video

US Election 2020 : ప్రపంచ వాయు కాలుష్యానికి భారత్, చైనా, రష్యా దేశాలే కారణం! - Donald Trump

ఇది ఇలావుంటే, గురువారం ర్యాలీలో కూడా ట్రంప్ తన మద్దతుదారుల కేరింతల మధ్య మాట్లాడుతూ.. ప్రపంచ కాలుష్యానికి కొన్ని దేశాలు దోహదం చేస్తున్నాయని అన్నారు. తాను స్వచ్ఛమైన గాలినే కోరుకుంటానని చెప్పారు. చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు మాత్రం గాలి కాలుష్యాన్ని చేస్తూ ప్రపంచానికి ముప్పు తెస్తున్నాయని ఆరోపించారు. అంతేగాక, ప్లాస్టిక్ బదులు పేపర్ వాడాలని పిలుస్తున్నవారిని కూడా ట్రంప్ ఎగతాళి చేశారు. ప్లాస్టిక్ స్ట్రాలు, ప్లేట్లు, కార్టన్స్ వాడుతున్నారుగా? అని ప్రశ్నించారు.

English summary
President Donald Trump says he has “nothing, whatsoever” remaining of symptoms from his coronavirus infection. But he acknowledged that doctors determined that his lungs were “a little bit infected” when he was hospitalised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X