వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపన్న మహిళగా కీర్తికిరీటం.. అయినా సంపదపై వైరాగ్యం...

|
Google Oneindia TeluguNews

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఆయన భార్య మెకంజీ బెజోస్ విడాకులు ఖరారయ్యాయి. డైవర్స్ సెటిల్‌మెంట్‌లో భాగంగా భారీ మొత్తాన్ని భరణంగా ఇచ్చేందుకు బెజోస్ అంగీకరించారు. 36 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన షేర్లు మెకంజీకి లభించనున్నాయి. ఇండియన్ కరెన్సీలో ఈ షేర్ల విలువ 2.49లక్షళ కోట్లు. ఇంత భారీ మొత్తం భరణం పొందుతున్న మెకంజీ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో మూడో స్థానంలో నిలవనున్నారు.

<strong>కేసు పెట్టగానే కోట్లు తరలించాడు వెలుగులోకి వస్తున్న నీరవ్ లీలలు</strong>కేసు పెట్టగానే కోట్లు తరలించాడు వెలుగులోకి వస్తున్న నీరవ్ లీలలు

ప్రేమ, పెళ్లి, విడాకులు

ప్రేమ, పెళ్లి, విడాకులు

జెఫ్ బెజోస్ విజయంలో మెకంజీ కీలక పాత్ర పోషించారు. హెడ్జిఫండ్ కంపెనీలో కలిసి పనిచేస్తున్న సమయంలో వారిద్దరి మధ్య మొదలైన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 1993లో జెఫ్, మెకంజీలు పెళ్లి చేసుకున్నారు. బెజోస్‌ కష్టసుఖాల్లో మెకంజీ వెన్ను దన్నుగా నిలిచారు. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో చివరకు విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు.

కీలక హక్కులు వదులుకున్న మెకంజీ

కీలక హక్కులు వదులుకున్న మెకంజీ

విడాకులు తీసుకున్నప్పటికీ మెకంజీకి భర్తపై ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే భరణంగా లభించే వాటాలపై వచ్చే కీలక హక్కులు, అధికారాలను మాజీ భర్తకు సంతోషంగా వదిలేసింది. వాషింగ్టన్ పోస్ట్, బ్లూ ఆరిజన్‌లో షేర్లు, అమెజాన్‌లో వాటాల హక్కులను, ఇతర అధికారాలను జెఫ్ బెజోస్‌కే వదిలేస్తున్నట్లు మెకంజీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. దీనిపై స్పందించిన జెఫ్ బెజోస్, మెకంజీకి కృతతలు చెప్పారు.

సంపన్న మహిళల్లో మూడో స్థానం

సంపన్న మహిళల్లో మూడో స్థానం

విడాకుల అనంతరం భరణం ద్వారా లభించే సొమ్ముతో మెకంజీ ప్రపంచంలో అత్యంత ధనిక మహిళల జాబితా చేరనున్నారు. సంపన్న మహిళల లిస్టులో ఆమె మూడోస్థానంలో నిలుస్తారని ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. ప్రస్తుతం లోరియల్ వారసురాలు ఫ్రాంకోయిస్‌ బెట్టెన్‌కోర్ట్‌ మేయేర్స్‌ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా.. వాల్ మార్ట్ ఆలిస్ వాల్టన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.

టీవీ యాంకర్‌తో బెజోస్‌కు సంబంధం

టీవీ యాంకర్‌తో బెజోస్‌కు సంబంధం

టీవీ యాంకర్ లారెన్‌తో బెజోస్‌కున్న సంబంధాలు జెఫ్, మెకంజీల పెళ్లి పెటాకులయ్యేందుకు కారణమైంది. వారిద్దరి సంబంధాల గురించి అమెరికన్ న్యూస్ పేపర్ ఎంక్వైరర్‌లో సంచలన కథనాలు రావడంతో మెకంజీ మనస్థాపానికి గురయ్యారు. భార్యభర్తల మధ్య బేధాభిప్రాయాలు సరిదిద్దుకోలేని స్థాయికి చేరడంతో చివరకు ప్రాణంగా ప్రేమించిన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని మెకంజీ నిర్ణయించారు.

English summary
Amazon founder Jeff Bezos and his wife, MacKenzie, finalized the biggest divorce settlement in history on Thursday, leaving him with 75 percent of their stock in the tech giant and giving her nearly $36 billion in shares.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X