వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో ఇదేం సెటిల్‌మెంటు: అమెజాన్ అధినేత భరణం కింద భార్యకు చెల్లించింది ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో అత్యంత ధనికుల్లో ఒకరైన అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్య మెకింజీ బెజోస్‌కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారు విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత జెఫ్‌ బెజోస్ ఆస్తిలో ఆమెకు ఎంత అందుతుందనేదానిపై సర్వత్రా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెరపడింది. ఇంతకీ జెఫ్ బెజోస్ తన భార్య మెకింజీ బెజోస్‌కుభరణం కింద ఎంత చెల్లించారో తెలుసా..?

 సగం ఆస్తిని ఛారిటీకి ఇస్తానని చెప్పిన మెకెంజీ బెజోస్

సగం ఆస్తిని ఛారిటీకి ఇస్తానని చెప్పిన మెకెంజీ బెజోస్

జెఫ్ బెజోస్ మెకింజీల మధ్య విడాకుల సెటిల్‌మెంట్ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ డబ్బులు మెకింజీ ఖాతాకు చేరడంలో ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళల్లో నాలుగో స్థానాల్లో నిలిచారు. విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా బెజోస్ తన భార్య మెకింజీకి 38 బిలియన్ అమెరికన్ డాలర్లు చెల్లించారు. 1993లో జెఫ్‌ బెజోస్‌ మెకింజీల వివాహం జరిగింది. 1994లో సియాటెల్‌లోని ఓ చిన్న గ్యారేజ్‌లో అమెజాన్‌ను బెజోస్ స్థాపించారు. ఇంత భారీ మొత్తంలో జెఫ్ బెజోస్‌ నుంచి భరణంగా వచ్చిన ఆస్తిని సగం ఓ చారిటీ సంస్థకు ఇవ్వనున్నట్లు మెకింజీ తెలిపారు. ద గివింగ్ ప్లెడ్జ్ అనే చారిటీ సంస్థకు ఈమె విరాళం ఇవ్వనున్నారు. దీని వ్యవస్థాపకులు వారెన్ బఫెట్ బిల్ గేట్స్. ప్రపంచంలోని ధనికులంతా సామాజిక సేవలో భాగం కావాలని వారంతా ద గివింగ్ ప్లెడ్జ్ సంస్థకు విరాళాలు ఇవ్వాల్సిందిగా వారెన్ బఫెట్, బిల్‌గేట్స్ ఇప్పటికే పిలుపునిచ్చారు.

 భారీగా ఆస్తులు ఇచ్చినప్పటికీ... జెఫ్ ఇంకా అత్యంత ధనికుడే

భారీగా ఆస్తులు ఇచ్చినప్పటికీ... జెఫ్ ఇంకా అత్యంత ధనికుడే

ఇక జెఫ్ బెజోస్ మెకింజీ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించారు.వీరికి నలుగురు సంతానం. విడాకుల సెటిల్‌మెంట్‌లో చరిత్రలో ఇదే అతి పెద్ద సెటిల్‌మెంట్‌గా తెలుస్తోంది.అమెజాన్ సంయుక్త స్టాక్స్‌లో 25శాతం మెకింజీకి దక్కింది. ఇక తన ఆస్తిలో ఈ 25శాతం తగ్గినప్పటికీ ఆయనే ప్రపంచ ధనికుల్లో తొలిస్థానంలో ఉన్నారు. తన ఆస్తుల విలువ 118 బిలియన్ డాలర్లు ఉంటుందని బ్లూంబర్గ్ బిలయనీర్స్ సూచిక వెల్లడిస్తోంది. ఈ వారంలోగా మెకింజీకి ఆస్తుల వివరాలు అందుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెజాన్‌లో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీకి ఆయనే బాస్‌గా వ్యవహరిస్తారు. అమెజాన్ నుంచి 4శాతం వాటాతో వెళుతున్న మెకింజీ తన ఓటింగ్ హక్కును జెఫ్ బెజోస్‌కు అప్పగించేశారు.

 మెకింజీ సామాజిక స్పృహను కొనియాడిన జెఫ్ బెజోస్

మెకింజీ సామాజిక స్పృహను కొనియాడిన జెఫ్ బెజోస్

ఇక మెకంజీ సగం ఆస్తిని సామాజిక సేవకు అంకితం చేయడాన్ని అభినందించారు జెఫ్ బెజోస్. సామాజిక సేవలో మెకంజీ ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఇదిలా ఉంటే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటన చేశారు. జెఫ్ తన భార్య మెకింజీని మోసం చేశారని అందుకోసమే ఇద్దరూ విడిపోవాలని భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పుకార్లుగా కొట్టిపారేశారు జెఫ్ బెజోస్

English summary
MacKenzie Bezos, wife of the globes’ richest man Jeff Bezos for 26 years, is set to walk away with a whopping USD 38 billion in the world’s biggest divorce settlement with the Amazon Founder and CEO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X