వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌కు ఘోర అవమానం.. టుస్సాడ్స్‌లో విగ్రహం తొలగింపు...

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్‌లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని తొలగించారు. సూట్‌లో... ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు,ట్రంప్ చిరకాల ప్రత్యర్థి ఒరాక్ ఒబామా మైనపు విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచారు. దీంతో అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇది ట్రంప్‌కు అవమానం లాంటిదే అన్న వాదన వినిపిస్తోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఇదో ప్రతీకాత్మక పరిణామమని మేడమ్ టుస్సాడ్స్ మార్కెటింగ్ మేనేజర్ ఓక్రిడ్జి యాల్సిడాంగ్ పేర్కొనడం గమనార్హం. దీన్నిబట్టి అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోతున్నారని అంచనా వేసి... ఆయన విగ్రహాన్ని తొలగించేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ఒబామాకు అత్యంత సన్నిహితురాలు
కావడంతో... ఈ పరిణామం వెనుక ఏంజెలా హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Madame Tussauds museum dumped US President Donald Trump before the election

ఇప్పటివరకూ వెల్లడైన నేషనల్ పోల్స్ ప్రకారం అమెరికాలో ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తోంది. చాలా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. అయితే 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పోల్స్ అంచనాలు తప్పిన నేపథ్యంలో... ఈసారి అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులవుతాయా అన్న చర్చ జరుగుతోంది. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా... ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రజలు ముందస్తు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

English summary
The waxwork museum Madame Tussauds in Berlin loaded its effigy of TV star-turned Republican presidential candidate into a dumpster on Friday, a move apparently intended to reflect its expectations of next Tuesday's presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X