వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానికి భారీ షాక్ -సీపీఎన్ కొత్త చైర్మన్‌గా మాధవ్ కుమార్ -ప్రచండ భారీ స్కెచ్

|
Google Oneindia TeluguNews

చలికాలంలోనూ హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రచండ నేతృత్వంలోని అధికార 'కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(సీపీఎన్)' ఏకంగా ప్రధాని కేపీ శర్మ ఓలిపై వేటేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సైతం పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ రద్దయిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపికకు మార్గం సుగమం చేస్తూ అధికార పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి..

దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్దుబ్బాక, గ్రేటర్ దెబ్బలు గుర్తుండేలా -చులకన స్థితిలోకి తెలంగాణ -కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

 అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్) కొత్త చైర్మన్‌గా మాధవ్ కుమార్ నేపాల్ ఎన్నికయ్యారు. ప్రస్తుత చైర్మన్, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ స్థానంలో మాధవ్ ఎన్నికయ్యారు. ఓలీపై క్రమశిక్షణ చర్యలకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ శ్రేష్ఠ ఈ విషయాలను మంగళవారం మీడియాకు చెప్పారు.

315ఓట్లతో కొత్త చైర్మన్..

315ఓట్లతో కొత్త చైర్మన్..

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ కొత్త చైర్మన్‌ ఎన్నిక కోసం మంగళవారం కీలక సమావేశం జరగ్గా, సెంట్రల్ కమిటీ సభ్యుల్లో 315 మంది మాధవ్ కుమార్ కు మద్దతుగా ఓటు వేసినట్లు నారాయణ్ శ్రేష్ట తెలిపారు. సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి, మళ్లీ ఎన్నికలకు వెళతానంటోన్న ప్రధాన మంత్రి, పార్టీ మాజీ చైర్మన్ కేపీ శర్మ ఓలీపై తమ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ప్రచండ వర్సెస్ ఓలి

ప్రచండ వర్సెస్ ఓలి

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో ప్రచండ, కేపీ శర్మ ఓలి వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఓలీ నాయకత్వంలో నేపాల్.. భారత్ కు బాగా దూరమై, చైనాకు బానిసలా మారిపోవడాన్ని ప్రచండ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శర్మ మాత్రం నేపాల్ చైనా వైపు ఉంటేనే మంచిదని వాదిస్తున్నారు. గొడవలు ముదరడంతో..

ఏప్రిల్‌లో ఎన్నికలు..

ఏప్రిల్‌లో ఎన్నికలు..

కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇటీవల పార్లమెంటును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఓలీ సిఫారసును నేపాల్ ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ ఆమోదించి, పార్లమెంటు ఎన్నికల తేదీలను ప్రకటించారు. నేపాల్ టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారంలో ఓలీ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఏప్రిల్ 30, మే 10 తేదీల్లో ఎన్నికలకు సిద్ధమవాలని ప్రజలను కోరారు. ఓలీ నిర్ణయం అనూహ్యమైనది కావడంతోపాటు అటు ప్రజలకు, ఇటు పార్టీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఓలీ చర్యకు వ్యతిరేకంగా 12 రిట్ పిటిషన్లు నేపాల్ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

మగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాకమగాడిలా పుట్టి.. అందాల ఆడబొమ్మగా -Miss Transqueen 2020 షైనీ సోని -భారత్ కీర్తిపతాక

English summary
Madhav Kumar Nepal has replaced Nepal Prime Minister KP Sharma Oli as chairman of the Nepal Communist Party, said party spokesperson Narayan Kaji Shrestha on Tuesday, adding that the party will be taking disciplinary action against Oli. Speaking at a press briefing, the ruling party’s spokesperson said, “KP Oli replaced with Madhav Kumar Nepal as chairman of the Nepal Communist Party.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X