వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్ 'మ్యాగీ' పాస్: నిబంధనలకు లోబడే సీసం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్‌ ఎలాంటి హానికర రసాయనాలు లేవని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌ను పరీక్షించిన అగ్రి ఫుడ్‌ అండ్‌ వెటర్నరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఏవీఏ) మ్యాగీ నూడుల్స్‌ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగదని స్పష్టం చేసింది.

అంతక ముందు భారత్‌లో మ్యాగీ నూడిల్స్‌పై భారత్‌‌లో వార్తలు వచ్చిన నేపథ్యంలో సింగపూర్‌ ప్రభుత్వం తాత్కాలికంగా భారత్‌ నుంచి మ్యాగీ నూడిల్స్‌ దిగుమతిని నిషేధించింది. భారత్‌ నుంచి దిగుమతైన నూడిల్స్‌ను అమ్మొద్దని ఆదేశించింది. తాము పరీక్షలు జరిపేంత వరకూ అమ్మకాలు నిలిపివేయాలన్న సింగపూర్ ప్రభుత్వం, తిరిగి సింగపూర్‌లో మ్యాగీ నూడుల్స్ అమ్మేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో నెస్లే షేరు విలువ నాలుగు శాతం మేర పెరిగింది. మంగళవారం ఉదయం రూ. 5,575తో ప్రారంభమైన నెస్లే స్టాక్‌ రూ.5,819 వరకు వెళ్లింది. మ్యాగీ నూడుల్స్ సీసం అత్యధికంగా ఉందని వార్తలు రావడంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Maggie instant noodles made in India safe to eat: AVA

మ్యాగీ నూడుల్స్‌లో అనుమతించిన స్థాయికన్నా మించి ఆరోగ్యానికి హాని చేసే సీసం లాంటి పదార్థాలున్నట్లు శాంపిల్స్ పరీక్షలో తేలడంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్నాటక, లాంటి అనేక రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించింది.

ఇకపై నెస్లే మ్యాగీ నూడుల్స్ నాణ్యత పరీక్షల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుందని ఆయన ప్రకటించారు. మ్యాగీ నూడుల్స్ ప్రచారం కోసం గతేడాది సుమారు రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టగా, నాణ్యత పరీక్షల కోసం కేవలం రూ. 19 కోట్లు మాత్రమే మ్యాగీ ఖర్చు పెట్టింది.

English summary
Maggie brand instant noodles manufactured in India are safe to eat, said the Agri-Food & Veterinary Authority of Singapore (AVA) yesterday (June 8) after its test results showed that the noodles meet Singapore’s food safety standards and do not pose food safety risks to consumers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X