వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూపపువా గినియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7గా నమోదు, భారీ సునామీ హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

బాలి/సిడ్నీ: న్యూబ్రిటన్ ఐస్‌లాండ్ పపువా న్యూగినియాలో గురువారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 7గా నమోదయింది. భారీ భూకంపంతో పాటు వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారీ సునామీ రావొచ్చునని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

పీఎన్‌జీ, సోలోమోన్ ఐస్‌ల్యాండ్ తదితర ప్రాంతాల్లో సునామీ అలలు దాదాపు 0.3 మీటర్ల ఎత్తుకు అంటే ఒక అడుగు ఎగిసిపడే అవకాశముందని తెలిపారు. భూకంపానికి సంబంధించి నష్టం గురించి అప్పుడే తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు.

Magnitude 7 earthquake strikes east of PNG, tsunami warning cancelled

భూకంప కేంద్రం న్యూబ్రిటన్‌లోని ఐస్‌లాండ్‌లో గల కింబే నుంచి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. 40 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూకంపం రావడానికి ముందు, వచ్చిన తర్వాత రెండుసార్లు చిన్నపాటి ప్రకంపనలు కూడా వచ్చాయి.

English summary
A major 7.0-magnitude earthquake struck Papua New Guinea's New Britain island on Thursday, triggering a tsunami warning. Hazardous tsunami waves were forecast for some coasts, the Pacific Tsunami Warning Center said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X