వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాత్యహంకార వ్యతిరేక దాడుల్లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం: క్షమాపణ చెప్పిన అమెరికా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కొద్దిరోజులుగా అగ్రరాజ్యం అమెరికాను అట్టుడికిస్తోన్న జాత్యహంకార వ్యతిరేక దాడులు జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని తాకాయి. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ప్రదర్శనలను చేపడుతోన్న ఆందోళనకారులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. జాత్యహంకారానికి, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఏకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్నే నడిపించిన గాంధీ విగ్రహాన్ని ఆందోళనకారులు అగౌరవపరిచారు. ఈ ఘటన పట్ల అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పింది.

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా కొద్దిరోజులుగా అమెరికాలో వరుసగా నిరసన ప్రదర్శనలను చేపట్టిన నల్ల జాతీయులు రాజధాని వాషింగ్టన్ డీసీలో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. అమెరికాలో 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం నిర్మించిన కట్టడాన్ని ధ్వంసం చేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన స్మారక చిహ్నాన్ని నేలమట్టం చేశారు. అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్ సమీపంలో ఉన్న చారిత్రాత్మక చర్చిపైనాా దాడులు చేశారు.

 Mahatma Gandhi’s statue in Washington vandalised, US Ambassador says Sorry

అదే క్రమంలో వాషింగ్టన్‌లోని భారత రాయాబార కార్యాలయం ఎదురుగా ప్రతిష్ఠించిన మహాత్మా గాంధీ విగ్రహంపై దాడి చేశారు. గుంపులు గుంపులుగా వచ్చిన నల్ల జాతీయులు రాళ్లు, ఇతర వస్తువులను దాడులు చేయడంతో మహాత్ముడి విగ్రహం ధ్వంసమైంది. విగ్రహం శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీన్ని గమనించి రాయబార కార్యాలయం అధికారులు వెంటనే శకలాలను తొలగించారు. మహాత్ముడి విగ్రహాన్ని తెల్లటి వస్త్రంలో కప్పేశారు.

అమెరికాలో మరో ఉపద్రవం: కరోనా.. జాత్యహంకార అల్లర్లకు తోడుగా: కంపించిన కాలిఫోర్నియాఅమెరికాలో మరో ఉపద్రవం: కరోనా.. జాత్యహంకార అల్లర్లకు తోడుగా: కంపించిన కాలిఫోర్నియా

ఈ ఘటన పట్ల అమెరికా ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. భారత్‌కు క్షమాపణ చెప్పింది. మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం కావడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లోని అమెరికా రాయబారి కెన్ జస్టర్ అన్నారు. ఈ ఘటన పట్ల తాము చింతిస్తున్నామని చెప్పారు. క్షమాపణలు కోరుతున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై సమగ్ర దర్యాప్తును జరిపించడానికి ఇప్పటికే తమ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.

English summary
Mahatma Gandhi’s statue outside the Indian Embassy in Washington DC was vandalised by some unidentified people involved in the ongoing protests against the death of black man George Floyd in the US on Wednesday. US Ambassador to India Ken Juster says Sorry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X