వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bristol Auction: మహాత్ముడి కళ్లజోడు విలువ రూ. కోట్లలోనే, రికార్డు బ్రేక్, అది జాతిపిత క్రేజ్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ లండన్: భారత జాతిపిత మహాత్మగాంధీకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్మగాంధీ పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలిసిందే. జాతిపిత మహాత్మగాంధీ కళ్లజోడు ఇప్పుడు ఏకంగా రూ. 2. 50 కోట్లు (260, 000 పౌండ్లు)కు విక్రయించడంతో మరోసారి ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. మహాత్మగాంధీ 100 ఏళ్ల క్రితం దక్షిణ ఆఫ్రికాలో ఆ కళ్లజోడు ఓ వ్యక్తికి బహుతిగా ఇవ్వడం, దానిని వేలం పాటలో కేవలం 6 నిమిషాల్లో ఓ వ్యక్తి రూ. 2. 50 కోట్ల కు కొనుగోలు చెయ్యడం చకచకా జరిగిపోయింది.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ !

 1920లో బహుమతి ఇచ్చిన గాంధీ

1920లో బహుమతి ఇచ్చిన గాంధీ

1920వ సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికాకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి మహాత్మగాంధీ ఆయన కళ్లజోడును బహుమతిగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. మహాత్మగాంధీ బహుమతిగా ఇచ్చిన కళ్లజోడును ప్రముఖ వ్యక్తి చాలాకాలం జాగ్రత్తగా చూసుకున్నారు. జాతిపిత మహాత్మగాంధీ ఉపయోగించిన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.

 6 నిమిషాల్లో కైవసం

6 నిమిషాల్లో కైవసం

లండన్ లోని ఈస్ట్ బ్రిస్టల్ లో ప్రపంచ ప్రఖ్యాంతి పొందిన వస్తువులు, పురాతన వస్తువులు, కోట్ల రూపాయల విలువైన వస్లువులు వేలం వేస్తుంటారు. 1920లో మహాత్మాగాంధీ దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ వ్యక్తికి ఇచ్చిన కళ్లుజోడును శుక్రవారం ఈస్ట్ క్రిష్టల్ లో వేలానికి పెట్టారు. వేలానికి పెట్టిన 6 నిమిషాల్లోనే అమెరికాకు చెందిన ఓ ప్రముఖుడు ఫోన్ లోనే వేలం పాటలో పాల్గొని రూ. 2. 50 కోట్లకు ( 260, 000 డాలర్లు)కు మహాత్మగాంధీ కళ్లజోడును కొనుగోలు చేశారు.

 హాట్ కేక్ లా వెళ్లిపోయింది

హాట్ కేక్ లా వెళ్లిపోయింది

ఈస్ట్ క్రిష్టల్ వేలం పాట నిర్వహించిన ఆండ్రూ స్టో స్థానిక మీడియాతో మాట్లాడుతూ మహాత్మగాంధీ కళ్లజోడు ఇంత భారీ మొత్తంలో విక్రయించడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. మహాత్మగాంధీ కళ్లజోడు 15, 000 డాలర్లకు విక్రయించాలని తాము టార్గెట్ పెట్టుకున్నామని, అయితే అంతకు 26 రెట్లు ఎక్కువగా కళ్ల జోడు వేలం పాటలో కొనుగోలు చెయ్యడం మాకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ఆండ్రూ స్టో సంతోషం వ్యక్తం చేశారు.

Recommended Video

Oxford's Covishield Vaccine Phase 2 & 3 Of Human Trials At Patna's RMRI || Oneindia Telugu
 ఇప్పుడే కాదు ఎప్పుడూ అదే క్రేజ్

ఇప్పుడే కాదు ఎప్పుడూ అదే క్రేజ్

మొత్తం మీద మహాత్మగాంధీ ఉపయోగించిన కళ్ల జోడు ఇంత భారీ మొత్తంలో విక్రయించడంతో భారతీయులు చాలా సంతోషంగా ఉన్నారని ఈస్ట్ క్రిస్టల్ వేలంపాట నిర్వహించిన యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. మహాత్మగాంధీ ఉపయోగించిన వస్తువులు ఎప్పుడు ఎక్కడ వేలం వేసినా ఎవ్వరూ ఊహించని రీతిలో కొనుగోలు చెయ్యడానికి చాలా మంది పోటీపడుతుంటారని క్రిస్టల్ వేలం పాట నిర్వహకులు ఇంతకు ముందుకూడా అనేకసార్లు చెప్పిన విషయం తెలిసిందే.

English summary
London: A pair of glasses, worn by Mahatma Gandhi, were sold for £260,000(around Rs2.5 Cr), at East Bristol auction, twenty-six times the guide price.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X