వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్న అధ్యక్షుడు, తమ్ముడు ప్రధానమంత్రి.. దేశ చరిత్రలో ఇదే మొదటిసారి...

|
Google Oneindia TeluguNews

ఔను.. అన్న అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. తమ్ముడు ప్రధానమంత్రి అయ్యారు. కీలకమైన రెండు పదవులను అన్నదమ్ములు చేపట్టడం ఆ దేశంలో తొలిసారి. వారేవరో కాదు మన పొరుగుదేశానికి చెందిన రాజపక్సే సోదరులు. ఇటీవల శ్రీలంక అధ్యక్ష ఎన్నికగల్లో గోటబయ విజయ దుందుబి మోగించిన సంగతి తెలిసిందే. తర్వాత వెంటనే ఆయన సోదరుడు మహింద్ర రాజపక్సే ప్రధాని పీఠం అధిష్టించారు.

 అధ్యక్షుడిగా అన్న

అధ్యక్షుడిగా అన్న

శ్రీలంక.. చిన్న ద్వీపం, ఆ దేశ జనాభా కూడా తక్కువే. కానీ బౌద్దులు, తమిళుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. గత ఆదివారం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. గోటబయా రాజపక్సే విజయం సాధించారు. పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇక ప్రధానమంత్రి వంతు వచ్చింది. ఆయన సోదరుడు, మాజీ అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శ్రీలంక దేశ చరిత్రలో అన్నదమ్ములు అధ్యక్ష, ప్రధానమంత్రులు అవడం ఇదే తొలిసారి అని ఆ దేశస్తులు చెప్తున్నారు.

 విక్రమ్ రాజీనామా

విక్రమ్ రాజీనామా

గోటబయా అధ్యక్షుడిగా విజయం సాధించగా దేశంలో పరిస్థితులు మారిపోయాయి. తమ ప్యానెల్ ఓడిపోవడంతో ప్రధానమంత్రి విక్రమ్‌సింఘే రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధానిగా తన సోదరుడు మహింద్ర రాజపక్సే పేరును గోటబయా ప్రకటించారు. ఇవాళ ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ప్రధాని బాధ్యతలు చేపట్టిన మహింద్ర రాజపక్సే 2005-2015 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఎల్టీఈఈపై లంక సైన్యం అధిపత్యం ప్రదర్శించింది.

15 మందితో మంత్రివర్గం..

15 మందితో మంత్రివర్గం..

శ్రీలంకలో సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది జరనున్నాయి. ఈ క్రమంలో కేర్ టేకర్ మంత్రివర్గాన్ని 15 మందితో అధ్యక్షుడు గోటబయ ఏర్పాటు చేశారు. వారు మార్చి 2020 వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారని శ్రీలంక అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని రద్దుచేసినట్టు పేర్కొన్నది.

గోటబయ ఎందుకంటే

గోటబయ ఎందుకంటే

దేశంలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మాంద్యం ఉంది. దీనికితోడు ఉగ్రవాద దాడులతో పర్యాటక రంగం కుదేలైపోయింది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితిని వివరించి.. గోటబయ రాజపక్సే ప్రజల అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా బౌద్దులు రాజపక్సేకు మద్దతు తెలిపారని తెలుస్తోంది. పేదలను ఆకట్టుకునేందుకు చాలా పథకాలు తీసుకొచ్చామని ప్రేమదాస చెప్పిన ప్రజలు మాత్రం విశ్వసించక.. గోటబయకు పట్టం కట్టారు.

English summary
Mahindra Rajapaksa, brother of Sri Lanka President Gotabaya Rajapaksa.. has sworn in as the new Prime Minister of the island country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X