వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఏజెన్సీ ఘోర తప్పిదం: వాజపేయికి బదులు జార్జ్ ఫెర్నాండేజ్ ఫొటో, నెటిజన్ల తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

టుడే స్పెషల్ స్టొరీ : వాజపేయికి బదులు జార్జ్ ఫెర్నాండేజ్ ఫొటో

న్యూఢిల్లీ/బీజింగ్: చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఘోర తప్పిదం చేసింది. భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజపేయిని గుర్తించడంలో విఫలం కావడం గమనార్హం.

భారతరత్న వాజపేయి మృతి విషయాన్ని ట్వీట్ చేస్తూ ఆయన ఫొటోకు బదులుగా జార్జ్ ఫెర్నాండెజ్ ఫొటోను పోస్ట్ చేసింది. వాజ్‌పేయి కేబినెట్‌లో ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా పనిచేశారు.

Major gaffe: Chinas Xinhua News uses George Fernandes image to announce Atal Bihari Vajpayees demise

వాజపేయి ఫొటో బదులు ఫెర్నాండెజ్ ఫొటో కనిపించడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. చీప్ జర్నలిజానికి ఇది నిదర్శనమని దుమ్మెత్తిపోశారు. కనీసం ఫొటో అయినా మార్చాలని కోరారు.

నెటిజన్ల విమర్శలతో అప్రమత్తమైన జిన్హువా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి తప్పును సరిదిద్దుకుంది. ఫొటోను సరిదిద్దిన తర్వాత కూడా కామెంట్ల వర్షం కురిసింది. మొత్తానికి తప్పును తెలుసుకుందని మరికొందరు ట్వీట్లు చేశారు.

English summary
Former prime minister Atal Bihari Vajpayee passed away in New Delhi after a prolonged illness. He was 93. In a rush to get this news out, China's Xinhua News made a mistake of tweeting with the founder of Samata Party, George Fernandes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X