వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా నుంచి కోలుకున్న వారిలో తీవ్రమైన అలసట: తాజా అధ్యయనం

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై అనేకమంది శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ తయారీలో అనేక మంది శాస్త్రవేత్తలు తలమూనకలయ్యారు. తాజాగా, శాస్త్రవేత్తలు కరోనా వ్యాధిబారినపడి కోలుకున్న వ్యక్తులపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

కరోనా బారినపడి కోలుకున్నవారిలో సగానికపైగా బాధితులు అలసట(నీరసం)తో బాధపడుతున్నారని తాజా అధ్యయనం తేల్చింది. కరోనా బారినపడి కోలుకున్నవారందరిలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నవారిలోనూ, సామాన్యంగా ఉన్నవారిలోనూ అలసట మాత్రం సుదీర్ఘంగా ఉంటున్నట్లు ఈ అధ్యయన కర్త లియామ్ టౌన్‌సెండ్(ఐర్లాండ్ సెయింట్ జేమ్స్ ఆస్పత్రి)

Majority of Covid-recovered complain of fatigue: Study

చాల్డర్ అలసట స్కోరు (CFQ-11 ద్వారా కరోనా నుంచి కోలుకున్నవారిలో అలసటను గుర్తించారు. కరోనా ఆయా వ్యక్తుల్లో ఉన్న తీవ్రతను కూడా వారు పరిశోధించారు. కరోనా నుంచి కోలుకున్న 128 మందిపై ఈ అధ్యయనం జరిపారు. 128 మందిలో 50ఏళ్ల సగటు వయస్సున్నవారున్నారు. 54శాతం మహిళలను కూడా ఉన్నారు.

52.3 శాతం అంటే 128 మంది 67 మంది కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. తీవ్రమైన అలసటతో బాధపడుతున్నట్లు అధ్యయనం తేల్చింది. జేమ్స్ ఆస్పత్రిలోని ల్యాబోరేటరీలోనే కరోనా నుంచి కోలుకున్నవారిపై అధ్యయనం చేశారు. ఈ 128 మందిలో 71 మంది ఆస్పత్రిలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకోగా.. మరో 57 మంది(44.5శాతం) ఆస్పత్రికి వెళ్లకుండానే కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రెండు గ్రూపుల్లోనూ అలసట మాత్రం దాదాపు సమానంగానే ఉన్నట్లు తేలిందన్నారు.

English summary
London, In a major study, the researchers have shown that persistent fatigue occurs in more than half of patients recovered from Covid-19, regardless of the seriousness of their infection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X