వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొరపాటు చేస్తే, భారీ మూల్యమే చెల్లించుకుంటారు: కరోనాపై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

జెనీవా: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్రమైన హెచ్చరిక చేసింది. కరోనాపై పోరాటంలో నిర్లక్ష్యం చేస్తే ప్రపంచ సుదీర్ఘమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని బుధవారం స్పష్టం చేసింది.

Recommended Video

Left Parties's State Wide Dharna Over Bifurcation Promises
కొన్ని దేశాలు మాత్రం..

కొన్ని దేశాలు మాత్రం..

డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ బుధవారం మాట్లాడుతూ.. పలు దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయని, మరికొన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమస్యలను కొన తెచ్చుకుంటున్నాయన్నారు. ఆఫ్రికా, అమెరికా దేశాల్లో కరోనా వ్యాప్తి, మరణాలకు నిర్లక్ష్యమే కారణమన్నారు.

అప్రమత్తం చేసినా..

అప్రమత్తం చేసినా..

పలు దేశాలు అప్రమత్తమై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయనే.. జనవరి 30నే యూఎన్ హెల్త్ ఏజెన్సీ గ్లోబల్ ఎమర్జెన్సీని విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, ప్రపంచ దేశాలను కరోనా పట్ల అప్రమత్తం చేయలేందంటూ టెడ్రోసన్ అమెరికాతోపాటు పలు దేశాలు విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, తాము అప్రమత్తం చేసినా పలు దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని టెడ్రోస్ వ్యాఖ్యానించారు.

పొరపాటు చేస్తే భారీ మూల్యమే..

పొరపాటు చేస్తే భారీ మూల్యమే..

ప్రస్తుతం యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని జెనీవాలో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో టెడ్రోస్ తెలిపారు. అయితే, ఆఫ్రికాతోపాటు సెంట్రల్, సౌత్ అమెరికా, ఈస్టర్న్ యూరోప్ దేశాల్లో మాత్రం కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. పలు దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా బారినపడుతున్నాయని, మరికొన్ని దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయని తెలిపారు. ఎలాంటి పొరపాటు చేసిన దీర్గ కాలికగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలను టెడ్రోస్ హెచ్చరించారు.

సరైన సమయంలోనే..

సరైన సమయంలోనే..

కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,75,000 కరోనా మరణాలు సంభవించాయి. 2.5 మిలియన్ల మంది కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ కరోనా నియంత్రణ విషయంలో తనవంతు పాత్రను పోషించిందని తెలిపారు. జనవరిలోనే గ్లోబల్ ఎమర్జెన్సీ విధించి దేశాలను అప్రమత్తం చేశామని మరోసారి గుర్తు చేశారు. సరైన సమయంలో హెచ్చరికలు చేసినా పలు దేశాలు అప్రమత్తం కాలేదని వ్యాఖ్యానించారు.

English summary
COVID-19 will stalk the planet for a long time to come, the World Health Organization said Wednesday, warning that most countries were still in the early stages of tackling the pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X