వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తంతో తడిసిన ఆ దుస్తులను చూసి మలాలా ఏడ్చేసింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఓస్లో: పాకిస్తాన్‌కు చెందిన సాహస బాలిక, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తాను తాలిబన్‌లో దాడిలో గాయపడినప్పుడు వేసుకున్న దుస్తులను చూసి చలించిపోయింది. రక్తంతో తడిసిన ఆ పాఠశాల యూనిఫాంను చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో తనతో పాటు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న భారత్‌కు చెదిన కైలాశ్ సత్యార్థి అక్కడే ఉన్నారు. మలాలను ఓదార్చారు.

నీవు చాలా ధైర్యవంతురాలివి అంటూ ఆయన ఆమెను ప్రశంసించారు. తాలిబాన్ దాడిలో మలాలా గాయపడినప్పుటి రక్తంతో తడిసిన నార్వే రాజధాని ఓస్లోలోని ఓ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్ననను మాలాలా, కైలాశ్ సత్యార్థి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పటి తన దుస్తులను చూసిన మాలాలా ఉద్వేగానికి గురైంది. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.

Malala weeps at sight of bloodied school uniform

ఆ దుస్తులను 2012 అక్టోబర్‌లో మలాలా తాలిబాన్ కాల్పుల్లో గాయపడినప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు భద్రపరిచారు. అమ్మాయిలు చదువుకోవాలని గట్టిగా చెప్పినందుకు తాలిబాన్ తీవ్రవాదులు 2012 అక్టోబర్‌లో పాకిస్తాన్ స్వాత్ వ్యాలీలో మాలాలాపై కాల్పులు జరిపి, హత్య చేయడానికి ప్రయత్నించారు.

కాల్పుల నుంచి మలాలా బతికి బయటపడింది. ఆమెకు ఇంగ్లాండులో సర్జరీ జరిగింది. ప్రదర్శనలో రక్తంతో తడిసిన స్క్వార్ఫ్, జాకెట్, ట్రౌజర్స్‌ను మలాలా చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో నువ్వు నాకు బిడ్డలాంటిదాదనివని అక్కున చేర్చుకు సత్యార్థి ఆమె తలపై ముద్దు పెట్టుకుని ఓదార్చారు. నోబెల్ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు మాలాలానే కావడం విశేషం.

English summary
akistan’s teen Nobel laureate Malala Yousafzai burst into tears Thursday at the sight of the bloodied school uniform she was wearing the day the Taliban shot her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X