వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చనిపోయారు: ఎంహెచ్370పై మలేషియా, కో పైలట్ వల్లే ఎయిర్ ఏషియా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: గత ఏడాది (2014) మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమానం పైన మలేషియా గురువారం నాడు ఓ ప్రకటన చేసింది. ఎంహెచ్ 370 విమానం ప్రమాదమని, అందులోని ప్రయాణీకులు, క్రూ సభ్యులు మృతి చెందారని పేర్కొంది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి మలేషియా ప్రభుత్వం కంపన్షేషన్ ఇవ్వనుంది. మృతి విషయం తెలిసిందే అయినప్పటికీ... మలేషియా ప్రకటన చేసిన ప్రకటన ఆ విమానంలో ప్రయాణించి కుటుంబ సభ్యులకు ఒకింత ఆవేదన మిగిల్చేదే.

Malaysia declares MH370 an accident, passengers dead, AirAsia crash: 'Co-pilot was flying plane'

''భారమైన హృదయంతో, ఎంతో ఆవేదనతో మలేషియా ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తోంది. మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానానికి ప్రమాదం జరిగిందని మలేషియా అధికారికంగా ప్రకటిస్తోంది. అందులోని 239 మంది ప్రయాణీకులు, వారితో పాటు క్రూ మెంబర్స్ మృతి చెందార"ని సివిల్ ఏవియేషన్ చీఫ్ అజారుద్దీన్ అబ్దుల్ రెహ్మాన్ చెప్పారు.

ఎయిర్ ఏషియాపై...

ఇండోనేషియాలోని జావా సముద్రంలో గత ఏడాది డిసెంబర్ కూలిపోయిన ఎయిర్ ఏషియా విమాన ప్రమాదం కారణాల పైన చిక్కుముడి వీడుతోంది.

ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ పైలట్ కాకుండా అంతగా అనుభవం లేని కో పైలట్ నడుపుతున్నాడని తేలిందని ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ తన ప్రాథమిక దర్యాఫ్తు నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణీకులు, క్రూ సభ్యులు మొత్తం 162 మంది మృతి చెందారు. వారిలో ఇప్పటి వరకు 70 మృతదేహాలు దొరికాయి.

English summary
Malaysia on Thursday formally declared missing flight MH370 to be an "accident" and its passengers and crew presumed dead, a step that opens the door for compensation payments but is likely to hit distraught relatives hard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X