వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతే.. కాశ్మీర్ ను ఆక్రమించుకుంది: విషం కక్కిన మలేసియా: వెలేయాలంటోన్న నెటిజనం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: మన పొరుగునే ఉన్న మలేసియా.. భారత్ పై తీవ్ర ఆరోపణ చేసింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని మనదేశంపై విషం చిమ్మింది. జమ్మూ కాశ్మీర్ అత్యంత జఠిల సమస్యగా మారడానికి భారత వైఖరే కారణమంటూ ఆ దేశ ప్రధానమంత్రి మహథిర్ మహమ్మద్ సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితిలో కీలకక ప్రకటన చేశారు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ అక్రమంగా ఆక్రమించిందని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్.. ఒక అడుగు ముందుకేయాలని పాకిస్తాన్ ను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు.

భారత్ దురాక్రమణ..

భారత్ దురాక్రమణ..

జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ మాత్రమే జీర్ణించుకోలేకపోయిందని అనుకున్నామని, తాజాగా ఈ జాబితాలో మలేసియా కూడా చేరిందని చెబుతున్నారు విశ్లేషకులు. ఆ దేశ ప్రధాన మంత్రి.. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదిక మీద భారత చర్యను తప్పు పట్టడం దీనికి ఉదాహరణ అని అంటున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత్.. జమ్మూ కాశ్మీర్ పై దురాక్రమణకు పాల్పడిందని, ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత భారత్ మీదే ఉందని మహథిర్ వ్యాఖ్యానించారు.

పరిష్కార మార్గాన్ని భారతే వెదుక్కోవాలి..

పరిష్కార మార్గాన్ని భారతే వెదుక్కోవాలి..

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ సమస్యను మరింత క్లిష్టతరమైందని, దీన్ని సామరస్యపూరకంగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపించాల్సింది కూడా భారతేనని మహథిర్ అన్నారు. కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించడానికి భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదని చెప్పారు. అంతకుముందు ఏర్పాటైన విలేకరుల సమావేశంలో కూడా మహిథిర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాశ్మీర్ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్ లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల అనంతరం ఈ అంశం మరింత జఠిలమైందని అన్నారు.

భగ్గుమన్న నెటిజనం

మహథిర్ మహమ్మద్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ప్రజలు భగ్గుమన్నారు. మరో శతృదేశం తయారైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మలేసియాను వెలి వేయాలంటూ నినదిస్తున్నారు. బాయ్ కాట్ మలేసియా అంటూ విరుచుకు పడుతున్నారు. బాయ్ కాట్ మలేసియా అనే పదాలకు హ్యాష్ ట్యాగ్ జోడించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇన్నాళ్లూ భారత్ సహాయ, సహకారాలను తీసుకుని ఆ దేశం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు పాకిస్తాన్ కు అనుకూలంగా ప్రవర్తిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. మనదేశానికి చెందిన పర్యాటకులెవరూ మలేసియాకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

పర్యాటకం బంద్..

మనదేశం నుంచి వెళ్లే పర్యాటకుల వల్ల మలేసియా తన ఆదాయాన్ని పెంచుకుంటోందని, అలాంటి దేశం పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడటం సరి కాదని చెబుతున్నారు. ఇకపై మనదేశానికి చెందిన పర్యాటకులెవరూ మలేసియాకు వెళ్లకూడదని పిలుపునిస్తున్నారు. ఒక్కసారి మలేసియాను వెలి వేయాలంటూ పిలుపునిస్తే.. ఇక అది దావానలంలా అంటుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయాన్ని పెద్ద ఎత్తున కోల్పోవడం ఖాయమని అంటున్నారు. మన డబ్బులతో మలేసియా వంటి దేశాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదంటూ తమ ట్వీట్ల ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
"There may be reasons for this action but it is still wrong. The problem must be solved by peaceful means. India should work with Pakistan to resolve this problem. Ignoring the UN would lead to other forms of disregard for the UN and the Rule of Law," said Mahathir. His statement has not been met well from Indians on social media, specifically supporters of the BJP, with the hashtag ‘Boycott Malaysia’ trending on twitter on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X