వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

92ఏళ్ల వయసులో మలేషియా ప్రధానిగా మహథీర్?..

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: మలేషియా పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు మహథీర్‌ మహ్మద్‌ సారధ్యంలోని విపక్ష పార్టీలు విజయం సాధించాయి. దీంతో మలేషియాకు స్వాతంత్య్రానంతరం నుంచి కొనసాగుతున్న బరిసాన్‌ నేషనల్‌ ప్రభుత్వ పాలనకు తెరపడింది.

గత 60ఏళ్లుగా మలేషియాలో బరిసాన్ నేషనల్ ప్రభుత్వమే కొనసాగుతూ వచ్చింది. తాజా ఎన్నికల్లో మహథీర్ సారథ్యంలోని పార్టీలు విజయం సాధించడంతో.. ఆయనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే 92ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడైన ప్రధానిగా ఆయన నిలుస్తారు.

Malaysias Mahathir Mohamad on course to be worlds oldest elected leader

కాగా, గతంలో 1981-2003కాలంలో 22ఏళ్ల పాటు మహథీర్ మలేషియా ప్రధానిగా కొనసాగారు. ఆయన నాయకత్వంలో మలేషియా ఆర్థికంగా అనూహ్య వృద్దిని సాధించింది.

ప్రస్తుత ప్రధాని నజాబ్ రజాక్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో విపక్షాలతో కలిసి ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగారు. తాజా ఎన్నికల్లో ఓటమిని నజాబ్ రజాక్ స్వాగతించారు. ప్రజాతీర్పును తాను అంగీకరిస్తానని వెల్లడించారు.

English summary
Mahathir Mohamad is on course to become the world's oldest elected leader at 92, after a shock victory in Malaysia's bitterly fought election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X