వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్దీవుల్లో ఎమర్జెన్సీ: అనుమానంగా కనిపిస్తే అరెస్టే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మాలే: మాల్దీవుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుడంతో ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ఎమర్జెన్సీని విధించారు. అనుమానితులు ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్ట్ చేయాలంటూ భద్రతా దళాలకు పూర్తి అధికారులను కట్టబెట్టారంటూ అధ్యక్షుడి అధికార ప్రతనిధి తెలిపారు.

భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 రోజుల పాటు ఎమర్జెన్సీని ప్రకటించారు. మాల్దీవుల్లో ప్రతిపక్ష పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ పార్టీ (ఎమ్‌డీపీ) ఓ పథకం ప్రకారం రెండు రోజుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేయడంతో ఆ దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Maldives declares state of emergency

సెప్టెంబర్‌ 28న మాల్దీవుల అధ్యక్షుడు యమీన్‌ అబ్దుల్‌ గయూమ్‌ ప్రయాణిస్తున్న బోట్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు గయూమ్‌ సురక్షితంగా బయటపడగా ఆయన భార్య, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ముగించుకుని మాలేకి స్పీడ్ బోట్‌లో తిరిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

అయితే ఈ ఘటనతో ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌‌కు సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి చైలులో ఉంచారు. ఈ క్రమంలో ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌‌‌ను విడుదల చేయాలంటూ ఎమ్‌డీపీ అధినేత నషీద్ అధ్యక్షుడిగా వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

అంతేకాదు ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను కించపరిచారు. ఈ నేపథ్యంలో నషీద్‌ను అరెస్ట్ చేసి జైలులో బంధించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మాల్దీవుల్లో విధ్వంసం సృష్టించేందుకు గాను గత వారంలో ప్రెసిడెంట్ అధికారిక నివాసం వద్ద బాంబును అమర్చారు. అయితే బాంబు స్క్వాడ్ సిబ్బంది దానిని తొలగించారు.

English summary
The Maldives president, Abdulla Yameen, has declared a state of emergency, giving sweeping powers to security forces to arrest suspects before a major anti-government protest rally, his spokesman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X