వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్దీవుల్లో ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు యామీన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

మాలే: మాల్దీవుల దేశాధ్యక్షుడు ఆబ్దుల్లా యామీన్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.అధ్యక్షుడి అత్యంత సన్నిహితుడుగా పేరున్న అజీమా షుకూర్ ఈ విషయాన్ని టెలివిజన్ లైవ్ లో ప్రకటించారు. అనుమానితులను అరెస్ట్ చేయడానికి భద్రతాదళాలకు అధికారులను ఇస్తోంది.

2013 నుండి యామీన్ దేశాధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. అయితే దేశంలో ప్రస్తుతం ఆయన తీవ్రమైన రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

Maldives state of emergency declared by government

4 లక్షల జనాభా ఉన్న మాల్దీవుల్లో పర్యాటకులకు స్వర్గథామంగా ఉంటుందని ప్రసిద్ది చెందింది. తొలిసారిగా నషీద్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నేత, అయితే 2012లో ఆయన అర్ధాంతరంగా పదవి నుండి తప్పుకొన్నాడు.

జైలులో ఉన్న విపక్ష రాజకీయ నేతలను విడుదల చేయాలని, 12 మంది ఎంపీలపై అనర్హత వేటు చెల్లదని ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో మాల్దావుల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు అబ్దుల్లా యామీన్ ప్రకటించారు.

English summary
The Maldives government has declared a state of emergency for 15 days amid a political crisis in the island nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X