వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశద్రోహం కేసు: మాల్దీవుల ఉపాధ్యక్షుడు అరెస్ట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాల్దీవుల ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌‌పై దేశద్రోహం కేసు నమోదైంది. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న అహ్మద్‌ను విమానాశ్రయంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రస్తుతం అతన్ని జైలులో ఉంచారు.

మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అహ్మద్‌ అదీబ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. సెప్టెంబర్‌ 28న మాల్దీవుల అధ్యక్షుడు యమీన్‌ అబ్దుల్‌ గయూమ్‌ ప్రయాణిస్తున్న బోట్‌లో బాంబు పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు గయూమ్‌ సురక్షితంగా బయటపడగా ఆయన భార్య, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ముగించుకుని మాలేకి స్పీడ్ బోట్‌లో తిరిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

ఈ ఘటనతో ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌‌కు సంబంధం ఉందనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
President Abdulla Yameen narrowly escaped injury when a blast struck the boat he was using to return home from the airport late last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X