• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

27 మందిని కాల్చేసిన ఉగ్రవాదులు, భారతీయులు క్షేమం: హోటల్లోకి ఇలా..

By Srinivas
|

మాలి: పశ్చిమాఫ్రికా దేశంలోని మాలి రాజధాని బమాకాలో గల రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదులు జొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మిగతావారిని భద్రతా దళాలు సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాయి.

రాడసన్ బ్లూ హోటల్లోకి ఉగ్రవాదులు జొరబడి 170 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఇరవై మంది భారతీయులు, అమెరికన్లు, బ్రిటన్లు తదితర దేశాల అతిథులతో పాటు ఐరాస ప్రతినిధులు ఉన్నారు. 30 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు.

ఈ దాడికి పాల్పడింది తామేనంటూ అల్ మౌరాబిటౌన్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇది అల్ ఖైదాకు చెందిన గ్రూప్. ఉగ్రవాదుల దాడిని ఫ్రాన్స్, అమెరికా, ఐరాస, మాలి దళాలు సంయుక్తంగా ఎదుర్కొన్నాయి. బందీలను విడుదల చేయించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

భారతీయులు క్షేమం

భారతీయులు క్షేమం

ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కిన 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. బమాకోలో ఉన్న హోటల్‌లో చిక్కుకుపోయిన మొత్తం 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్‌లో ప్రకటించారు. దీనిపై విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ కూడా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. భారతీయులందరినీ రక్షించాం. మాలీలోని మన రాయబారి అజయ్‌ కుమార్‌ శర్మ చొరవకు కృతజ్ఞతలన్నారు.

కలిసికట్టుగా ఆపరేషన్

కలిసికట్టుగా ఆపరేషన్

ఉగ్రవాదుల దాడి విషయం తెలిసిన వెంటనే మాలి ప్రత్యేక దళాలు, పోలీసులు రంగంలోకి దిగారు. మాలి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఫ్రాన్స్‌ రక్షణమంత్రి డ్రెయిన్ 40 మందితో కూడిన పారామిలిటరీ దళాన్ని మాలి పొరుగునున్న బుర్కినాఫాసో నుంచి పంపించారు. వీరు ఉగ్రవాదులు, తీవ్రవాదులు జరిపే దాడులను ఎదుర్కోవటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందినవారు. మాలిలో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళాలు కూడా వీరికి కలిశాయి.

బందీలను విడిపించారు

బందీలను విడిపించారు

బందీల్లో అమెరికన్లు ఉండటంతో వారిని విడిపించుకోవటం కోసం అమెరికా ప్రత్యేక దళాలు కూడా బమాకోకు ఆగమేఘాల మీద వచ్చి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. భద్రతా దళాలు ఒక్కో అంతస్తులో బందీలను విడిపిస్తూ ముందుకు వెళ్లాయి. దాదాపు తొమ్మిది గంటల అనంతరం దుండగుల చెర నుంచి బందీలందరినీ విడిపించగలిగారు.

అల్ మౌరా బిటౌన్ ప్రకటన

అల్ మౌరా బిటౌన్ ప్రకటన

రాడిసన్‌బ్లూ హోటల్‌పై దాడి తాము జరిపిందేనని అల్‌ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థ అల్‌మౌరా బిటౌన్‌ ప్రకటించింది. ఉత్తర మాలి కేంద్రంగా నడిచే ఈ సంస్థలో ప్రధానంగా తువారెగ్‌, అరబ్‌ తిరుగుబాటుదార్లున్నారు. రాడిసన్‌బ్లూ హోటల్‌పై దాడి జరిపిన ఉగ్రవాదులు ఇద్దరు ముగ్గురికి మించి ఉండకపోవచ్చని చెబుతున్నారు. దాడి సమయంలో ఉన్న ప్రత్యక్షసాక్షులు మాత్రం దాదాపు పదిమంది కాల్పులు జరిపారని చెబుతున్నారు.

 ఉగ్రవాదులు

ఉగ్రవాదులు

ఉగ్రవాదుల దాడులకు మాలి లక్ష్యంగా మారటం ఇది తొలిసారి కాదు. 2012లో మాలి ఉత్తరప్రాంతాన్ని ఆల్‌ఖైదా అనుబంధ తువారెగ్‌ తిరుగుబాటుదార్లు ఆక్రమించారు. దీనిని ఫ్రాన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన సైనికదాడి తిప్పికొట్టింది. తిరిగి ఆ ప్రాంతం మాలి ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చింది. మాలి ఒకప్పుడు ఫ్రాన్స్‌ వలసదేశం కాబట్టి ఫ్రాన్స్‌తో ఆ దేశానికి సంబంధాలున్నాయి.

 ఉగ్రవాదులు

ఉగ్రవాదులు

ఈ ఏడాది జూన్‌లో తువారెగ్‌ తిరుగుబాటుదార్లకు, ప్రభుత్వ అనుకూల సాయుధ దళాలకు శాంతి ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ తీవ్రవాదులు దానిని ఉల్లంఘిస్తూ హత్యాకాండకు తెగబడ్డారు. గత ఆగస్టులో సెవరె అనే పట్టణంలో ఉన్న ఓ హోటల్‌పై దాడి చేశారు.

 ఉగ్రవాదులు

ఉగ్రవాదులు

ఈ ఘటనలో ఐదుగురు ఐరాస సిబ్బంది, నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. రాజధాని బమాకోలోని ఓ రెస్టారెంట్‌పై ఈ ఏడాది మార్చిలోనూ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులతోపాటు మొత్తం అయిదుగురు మరణించారు.

ఉగ్రవాదులు ప్రవేశించారిలా..

ఉగ్రవాదులంతా డిప్లొమాటిక్‌ లైసెన్స్‌ ప్లేట్‌ ఉన్న కారులో హోటల్‌ వద్దకు వచ్చారని చెబుతున్నారు. ముఖానికి మాస్కులు ధరించి కారులో నుంచి ఉగ్రవాదులు బయటకు దిగగా వారిని హోటల్‌ వద్ద భద్రత సిబ్బంది ఆపారు. వెంటనే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపి హోటల్‌లోకి ప్రవేశించారు.

 ఉగ్రవాదులు ప్రవేశించారిలా..

ఉగ్రవాదులు ప్రవేశించారిలా..

ఉగ్రవాదులు కారులో వచ్చి సెక్యూరిటీ బారియర్‌ను తోసేసి బలవంతంగా లోపలికి వచ్చారని మరికొందరు చెబుతున్నారు. పలువురు ఉగ్రవాదులు లోపలికి వెళ్లారన్నారు. హోటల్ భద్రతా సిబ్బంది పైన కాల్పులు జరిపారు.
ఉగ్రవాదులు హోటల్‌పై దాడిచేసి పలువురిని బందీలుగా ఉంచారు. బందీలుగా ఉంచిన వారిని హోటల్‌ ఏడో అంతస్థుకు తీసుకు వెళ్లారు. హోటల్‌లోకి భద్రత బలగాలు ప్రవేశించి బందీలను రక్షించాయి.

English summary
Mali Hotel Attack: US Citizen Among 27 Dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X